Webdunia - Bharat's app for daily news and videos

Install App

నా కుమార్తె వస్త్రధారణపై మోడీకే అభ్యంతరం లేదు.. మీకెందుకయ్యా : ప్రియాంకా తల్లి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ సమయంలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ధరించిన దుస్తులపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రియాంకా తీరును తూర్పారబట్టారు. దీనిపై ప్రియ

Webdunia
బుధవారం, 12 జులై 2017 (10:00 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో భేటీ సమయంలో బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా ధరించిన దుస్తులపై తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ముఖ్యంగా నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రియాంకా తీరును తూర్పారబట్టారు. దీనిపై ప్రియాంకా తల్లి మధు చోప్రా వివరణ ఇచ్చారు. 
 
నిజానికి ప్రియాంక ఆరోజు ప్ర‌ధానిని క‌ల‌వ‌డం ముందే ప్లాన్ చేసుకున్న‌ది కాద‌నీ, ఏదో అక‌స్మాత్తుగా జ‌రిగిపోయింద‌ని మ‌ధు చెప్పారు. ఆ త‌క్కువ స‌మ‌యంలో చీరలోకి మారే స‌మ‌యం లేద‌ని, ఆ విష‌యం గురించి ప్ర‌ధాని ప్రోటోకాల్ ప్ర‌తినిధిని క‌ల‌వ‌గా వ‌స్త్ర‌ధార‌ణపై ప్ర‌ధానికి ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని చెప్ప‌డంతోనే ప్రియాంక అలా వెళ్లి క‌లిసింద‌ని మ‌ధు చోప్రా వివ‌రించారు. పైగా, ఈ విషయంలో ప్రధానికి లేని అభ్యంతరం నెటిజన్లకు ఎందుకని ఆమె ప్రశ్నించారు. 
 
కాగా, ఇటీవల బెర్లిన్‌లో ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీతో ప్రియాంకా చోప్రా భేటీ అయిన విషయంతెల్సిందే. ఆ సమయలో మోకాళ్ల వ‌ర‌కు కాళ్లు క‌నిపించే వ‌స్త్ర‌ధార‌ణ‌తో ప్రియాంక చోప్రా ఉన్నారు. దీనిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా సంప్ర‌దాయ‌వాదులు విమ‌ర్శ‌ల వ‌ర్షం కురిపించిన సంగ‌తి తెలిసిందే. వారికి త‌గ్గ‌ట్టుగా ప్రియాంక కూడా మ‌రో ఫొటోను పోస్ట్ చేసి ఘాటుగా స‌మాధానం కూడా ఇవ్వ‌డం కూడా జరిగింది. అయినా ఈ వివాదం సద్దుమణగక పోవడంతో ఆమె తల్లి మధు చోప్రా వివరణ ఇచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

కరోనా రోగిపై అత్యాచారం... అంబులెన్స్ డ్రైవర్‌కు జీవితఖైదు

పరీక్షల్లో వైద్య విద్యార్థుల మాల్ ప్రాక్టీస్ - పట్టుబడిన మరో ఇద్దరు

ఎలుగుబంటికి నరకం చూపించిన గ్రామస్థులు!!

మామను గొడ్డలితో నరికి ... తలతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన అల్లుడు

తనయుడుతో హైదరాబాద్ చేరుకున్న పవన్ కళ్యాణ్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

తర్వాతి కథనం
Show comments