Webdunia - Bharat's app for daily news and videos

Install App

భర్తపై కోపం.. కారు నుంచి దించేసి గొడవపడిన ప్రియాంక చోప్రా.. ఏమైంది?

Priyanka Chopra
Webdunia
బుధవారం, 16 డిశెంబరు 2020 (20:26 IST)
బాలీవుడ్ టాప్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకు భర్త నిక్‌పై కోపం వచ్చింది. దీంతో లండన్ వీధుల్లో వీరిద్దరి మధ్య మాటలయుద్ధం జరిగింది. అంతే వెంటనే తన భర్తను కారులో నుంచి దిగిపొమ్మని గట్టిగా చెప్పింది ప్రియాంక. అయితే ప్రియాంక తన భర్తతో గొడపడింది రియల్ లైఫ్‏లో కాదండోయ్ రీల్ లైఫ్‏లో ఇదంతా జరిగింది. ప్రస్తుతం ప్రియాంక్ తన కొత్త సినిమా ‘టెక్ట్స్ ఫర్ యూ’ షూటింగ్‏లో బిజీగా ఉన్నారు. 
 
ఈ మూవీలో ప్రియాంక భర్త నిక్‏జోనాస్‏ అతిథి పాత్రలో కనిపించనున్నారు. అయితే తాజాగా వీరిద్దరికీ సంబంధించిన కొన్ని సన్నివేశాలను లండన్‏లో చిత్రీకరించారు. అందులో భాగంగానే తనతోపాటు కారులో ప్రయాణిస్తున్న నిక్‏తో ప్రియాంక గొడవపడడం, ఆ తర్వాత నిక్‏ను తన కారు నుంచి దిగిపొమ్మని చెప్పడం.. ఇలాంటి కొన్ని సీన్లను చిత్రీకించారు. ఈ సీన్లకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 
 
కాగా.. ప్రియాంక చోప్రా, హాలీవుడ్ హీరో నిక్‏జోనాస్‏ను ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. హాలీవుడ్‏లో క్వాంటికో సిరీస్‏లో నటించి మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక.. తనకంటే పదేళ్ళు చిన్నవాడైన నిక్‏జోనాస్‏ను 2018లో ప్రేమించి పెళ్ళి చేసుకుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మార్కులు వేస్తానని చెప్పి వేధింపులు - కీచక ప్రొఫెసర్ రజినీష్ కుమార్ అరెస్టు

మరో 15 యేళ్లు చంద్రబాబే ముఖ్యమంత్రి : డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

దుర్యోధనుడి ఏకపాత్రాభినయం చేసి ఆర్ఆర్ఆర్ (Video)

కాంట్రాక్ట్ ఉద్యోగిపై రెచ్చిపోయిన ఎమ్మెల్యే - ఎలా దాడిచేస్తున్నాడో చూడండి (Video)

Pawan Kalyan: చంద్రబాబు, మంద కృష్ణ మాదిగను ప్రశంసించిన పవన్ కళ్యాణ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments