Webdunia - Bharat's app for daily news and videos

Install App

డొనాల్డ్ ట్రంప్‌ అంటే నాకేంటి భయం..? నేను భారతీయురాలిని..!: ప్రియాంక చోప్రా

హాలీవుడ్ కార్పొట్‌పై నిల్చుని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా భారతదేశ ప్రజలను గర్వపడేలా చేసింది. హాలీవుడ్ అరంగేట్రంతో గ్లోబల్‌స్టార్‌‌గా మారిపోయిన ప్రియాంక చోప్రా పీపుల్స్‌ చాయిస్‌ అవార్డు అందుకొని

Webdunia
గురువారం, 19 జనవరి 2017 (18:12 IST)
హాలీవుడ్ కార్పొట్‌పై నిల్చుని బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా భారతదేశ ప్రజలను గర్వపడేలా చేసింది. హాలీవుడ్ అరంగేట్రంతో గ్లోబల్‌స్టార్‌‌గా మారిపోయిన  ప్రియాంక చోప్రా పీపుల్స్‌ చాయిస్‌ అవార్డు అందుకొని మరోసారి భారతదేశ ప్రజల్ని గర్వపడేలా చేసింది. అంతేకాదు.. అమెరికా భావి అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఒక్క జవాబుతో నోటికి తాళంవేసింది. 
 
ఈ అవార్డు అందుకోగానే ప్రియాంక వద్ద మీడియాతో ముచ్చటించింది. కొత్త అమెరికా అధ్యక్షుడైన డొనాల్డ్ ట్రంప్‌పై మీ అభిప్రాయం ఏంటి. మీరేమైనా భయపడుతున్నారా?' అని ఓ విలేకరి అడిగాడు. ఇందుకు ప్రియాంక.. 'నేను భారతీయురాలిని. నీకు భయంగా ఉందా?' అని ధీటుగా సమాధానం ఇచ్చింది. అయితే ఆ విలేకరి తనకు భయం లేదు కానీ మిగతా విదేశీయులకి భయం అని చెప్పి అక్కడి నుంచి ఇంకేమీ మాట్లాడలేక పక్కకి తప్పుకున్నాడు.
 
కాగా బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా మరోసారి పీపుల్స్ చాయిస్ అవార్డు అందుకుంది. బుధవారం జరిగిన కార్యక్రమంలో ప్రియాంక చోప్రా అమెరికన్ టీవీ సిరీస్ క్వాంటికోకి పీపుల్స్ చాయిస్ అవార్డు 2017కుగాను ఫేవరేట్ డ్రమటిక్ టీవీ నటిగా అవార్డు అందుకుంది. 
 
హాలీవుడ్ డెబ్యూట్ మూవీ బేవాచ్‌తో ప్రియాంక ఈ సమ్మర్‌లో థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. క్వాంటికో సీజన్2లో ప్రియాంక ఎఫ్‌బీఐ ఏజెంట్‌గా అలెక్స్‌పారిస్ పాత్రలో నటిస్తోంది. 2016లో క్వాంటికో సిరీస్ విభాగంలో పీపుల్స్ చాయిస్ అవార్డును పొందిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రధానమంత్రి నరేంద్ర మోడి, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ రోడ్ షో (Live Video)

ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం - ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు రద్దు!

KCR:కేసీఆర్ మిస్సింగ్.. బీజేపీ ఎక్స్ హ్యాండిల్‌లో పోస్ట్ వైరల్

వ్యక్తిని తొండంతో లేపి విసిరేసిన ఏనుగు (Video)

డ్రైవింగ్ శిక్షణలో అపశృతి - తేరుకునేలోపు దూసుకెళ్లింది... (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసి, అల్లం, అతిమధురం.. ప్రాణాపాయం.. గోరువెచ్చని ఉప్పు నీటితో..?

ఆముదం నూనెతో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు

ఫ్రూట్ కేక్ తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

HMPV వ్యాప్తి గురించి ICMR ఏం చెప్పింది? వ్యాధి లక్షణాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments