Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యక్తిగత జీవితం లేనప్పుడు కోట్లు సంపాదించినా ఏం చేసుకుంటాం: ఓ నటి ఫిలాసఫీ

చేతినిండా పని ఉండటం అతి పెద్ద అదృష్టమే కానీ మనకంటూ సొంత జీవితం కోసం సమయాన్ని కేటాయించుకోకపోతే కోట్లు సంపాదించినా లాభం లేదంటున్నారీమె.

Webdunia
మంగళవారం, 28 మార్చి 2017 (05:19 IST)
ఇప్పుడామె ప్రపంచం గ్లోబల్ కుగ్రామం. ఒక కాలు ఇండియాలో, మరో కాలు అమరికాలో మరో కాలు ఉంటే వేరే దేశాల్లో.. బాలీవుడ్, హాలీవుడ్, మిగతా ఉడ్‌లు అన్నింటినీ దున్నేస్తున్న ప్రముఖ బాలివుడ్ నటి ప్రియాంక చోప్రా ప్రపంచంలో ఎక్కడ అవకాశాలు ఉంటే అక్కడికి వాలిపోతానంటున్నారు. ప్రియాంక అంత బిజియెస్ట్ పర్సన్ ఇప్పుడు భారత్‌లోనే ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. జీవితంలో ఇంత బిజీ అవుతానని కల్లో కూడా ఊహించలేదంటున్న ప్రియాంక వ్యక్తిగత జీవితం తనకు చాలా విలువైనది అంటున్నారు. 
 
చిన్న వయస్సులోనే జీవితాన్ని తాత్విక దృష్టితో చూడడం ప్రియాంకకు అలవాటైనట్లుంది. చేతినిండా పని ఉండటం అతి పెద్ద అదృష్టమే కానీ మనకంటూ సొంత జీవితం కోసం సమయాన్ని కేటాయించుకోకపోతే కోట్లు సంపాదించినా లాభం లేదంటున్నారీమె. కోట్లు సంపాదిస్తాం. వ్యక్తిగత జీవితం లేనప్పుడు ఆ సంపాదన ఏం చేసుకుంటాం అన్నది ఈమె ఫిలాసఫీ. వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమైనప్పుడు ఎవరైనా కాస్త వెనక్కి తిరిగి చూసుకోవలసిందే అన్నది ప్రియాంక అభిప్రాయం.
 
తన జీవిత ఘర్షణ నుంచి, ఒత్తిడి నుంచి ప్రియాంక నేర్చుకున్న ఈ జీవన తాత్వికత అందరికీ అవసరమైనదే.. ఆమె అన్నది మామూలు మాట కాదు. వ్యక్తిగత జీవితమే లేనప్పుడు కోట్లు సంపాదించి ఏం చేసుకుంటాం.. ఈ ప్రశ్నకు సమాధానానికి ఎవరికి వాల్లు తొంగి చూసుకోవలసిందే.
 

సంతోషిమాత అమ్మవారికి కేజీ బరువున్న వెండి చక్రం

అమెరికాలో తెలుగు టెక్కీ కారు ప్రమాదం నుంచి తప్పించుకున్నా మరో కారు రూపంలో మృత్యువు

Telangana రిజిస్ట్రేషన్లు ఇకపై TS కాదు TG, ఉత్తర్వులు జారీ

ఊపిరి పీల్చుకున్న మంజుమ్మెల్ బాయ్స్‌ నిర్మాతలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

ఈ పండ్లు, కూరగాయలు తిని చూడండి

కరివేపాకు టీ ఆరోగ్య ప్రయోజనాలు

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments