Webdunia - Bharat's app for daily news and videos

Install App

వయసులో చిన్నోడైనా... అతనే నాకు సరిజోడి.. అక్టోబరులో పెళ్లి : ప్రియాంకా చోప్రా

వయసులో చిన్నోడు అయినప్పటికీ.. అతనే తనకు సరిజోడి అని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా అంటోంది. హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనాస్‌ను ప్రియాంకా చోప్రా పెళ్లాడనున్న విషయం తెల్సిందే. వీరిద్దరు వయసు రీత్యా పద

Webdunia
ఆదివారం, 29 జులై 2018 (13:19 IST)
వయసులో చిన్నోడు అయినప్పటికీ.. అతనే తనకు సరిజోడి అని బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా అంటోంది. హాలీవుడ్ నటుడు, సింగర్ నిక్ జోనాస్‌ను ప్రియాంకా చోప్రా పెళ్లాడనున్న విషయం తెల్సిందే. వీరిద్దరు వయసు రీత్యా పదేళ్లు తేడా ఉంది. అంటే తనకంటే పదేళ్లు చిన్నోడు అయిన నిక్ జోనాస్‌ను ప్రియాంకా అక్టోబరు నెలలో పెళ్లాడనుంది. వీరిద్దరి వివాహంపై పలు పత్రికలు పలు రకాలైన కథనాలను ప్రచురిస్తున్నాయి.
 
అక్టోబరులో జరిగే వివాహం కోసం ప్రియాంకా చోప్రా ఇప్పటికే వెడ్డింగ్ గౌన్‌ను కూడా సెలెక్ట్ చేసుకున్నట్టు సమాచారం. లండన్‌లో ఇద్దరూ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు వచ్చిన వార్తలపై మాత్రం ప్రియాంకా ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆ ఇద్దరూ అక్టోబర్‌లో పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు మాత్రం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. 
 
మరోవైపు, ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌ల వివాహానికి సంబంధించి తాజాగా బాలీవుడ్ ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జ‌ఫ‌ర్ తన ట్విట్ట‌ర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. స‌ల్మాన్ ఖాన్, ప్రియాంక చోప్రా ప్ర‌ధాన పాత్ర‌ల‌లో అలీ అబ్బాస్ భార‌త్ అనే సినిమాని తెర‌కెక్కించాల‌నుకున్నాడు. ఆగ‌స్ట్ 10న ప్రియాంక చోప్రా షూటింగ్‌లో పాల్గొనాల్సి ఉంది. కానీ తాను షూటింగ్ నుంచి త‌ప్ప‌కుంద‌ని చెప్పాడు. అంటే ప్రియాంకా పెళ్లి కారణంగానే ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు ఆయన చెప్పకనే చెప్పారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సీఎం రేవంత్ రెడ్డికి ఊరట.. అట్రాసిటీ కేసును కొట్టేసిన హైకోర్టు

ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య - చేతులు కలిపిన కుమారుడు..

వల్లభనేని వంశీకి షాక్ - అలా బెయిల్ ఎలా ఇస్తారంటూ సుప్రీం ప్రశ్న?

రాజస్థాన్‌లో తొమ్మిదేళ్ల బాలిక గుండెపోటుతో మృతి

Delhi: మూడేళ్ల పసికూనపై అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments