Webdunia - Bharat's app for daily news and videos

Install App

'తల' మూవీ నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ లిరికల్ వీడియో సాంగ్ విడుదల

ఠాగూర్
ఆదివారం, 9 ఫిబ్రవరి 2025 (17:24 IST)
అమ్మ రాజశేఖర్ దర్శకత్వంలో ఆయన తనయుడు అమ్మ రాగిన్ రాజ్ హీరోగా రూపొందిన సినిమా "తల". తాజాగా మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి చేతుల మీదుగా విడుదలైన ఈ మూవీ తమిళ్, తెలుగు ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. చూసిన వాళ్లంతా సూపర్బ్ అని మెచ్చుకుంటున్నారు. 'రణం' తర్వాత అంతకు మించిన బ్లాక్ బస్టర్‌ను అందుకోబోతున్నాడు అమ్మ రాజశేఖర్ అనే టాక్ కూడా వినిపిస్తోంది. 
 
తాజాగా ఈ చిత్రం నుంచి ‘ప్రేమ కుట్టిందంటే’ అనే లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. పాట వినగానే ఇమ్మీడియెట్‌గా కనెక్ట్ అయిపోయేలా ఉంది. బిగ్ బాస్ ఫేమ్ ఎనర్జిటిక్ సింగర్ భోలే షావలీ పాడిన ఈ గీతాన్ని మ్యూజిక్ డైరెక్టర్ ధర్మతేజ రాశాడు. విశేషం ఏంటంటే.. ఈ పాటను తమిళంలో మల్టీ టాలెంటెడ్ లెజెండరీ పర్సనాలిటీ టి రాజేందర్ పాడారు. ఇలాంటి హుషారైన గీతాలకు టి.రాజేందర్ పెట్టింది పేరు. అందుకే ఈ పాట తమిళంలోనూ ఊపేస్తోంది. 
 
ప్రధానంగా ఈ పాటను కమెడియన్ ముక్కు అవినాష్‌పై చిత్రీకరించారు. ప్రేమలో పడితే ఎదురయ్యే సమస్యలు, కష్టాలు ఎలా ఉంటాయో అతను వివరిస్తున్నట్టుగా ఉంది సాహిత్యం. రణం చిత్రంలో అలీపై చిత్రీకరించిన ‘నమ్మొద్దు నమ్మొద్దూ ఆడవాళ్లను నమ్మొద్దూ’ అనే పాట ఎంత పెద్ద హిట్ అయిందో అంతకు మించిన హిట్ అయ్యే పాటలా ఉంది. 
 
‘చీమ ఎక్కడ కుడితే అక్కడే మంట పుడుతుందయా.. దోమ కుట్టిందంటే వస్తుంది మలేరియా.. కానీ ప్రేమ కుట్టిందంటే పిచ్చెక్కిపోతుందయా’ అంటూ మొదలైన ఈ పాటలో ఈ తరం యూత్ కు బాగా నచ్చేలా ఉంది సాహిత్యం. ప్రేమలో పడితే అమ్మాయిలు పెట్టించే ఖర్చులు, వారు పెట్టే ఇబ్బందులు తెలుపుతూ ఆఖరులో ప్రేమ గురించి అడిగితే ‘హూ ఆర్ యూ’ అందిరా అంటూ వచ్చే ఫినిషింగ్ టచ్ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రాన్ని ఈ నెల 14న వాలెంటైన్స్ డే సందర్భంగా విడుదల చేయబోతున్నారు. 
 
దర్శకుడు: అమ్మ రాజశేఖర్
నిర్మాత : శ్రీనివాస గౌడ్
బ్యానర్: దీపా ఆర్ట్స్
నటీనటులు: అమ్మ రాగిన్ రాజ్, అంకిత నస్కర్, రోహిత్, ఎస్తేర్ నోరోన్హ, ముక్కు అవినాశ్, సత్యం రాజేశ్, అజయ్, విజ్జి చంద్రశేఖర్, రాజీవ్ కనకాల, ఇంద్రజ, శ్రవణ్
రైటర్స్: అమ్మ రాజశేఖర్
డీఓపీ: శ్యామ్ కె నాయుడు
సాంగ్: థమన్ ఎస్‌ఎస్
మ్యూజిక్ డైరెక్టర్: ధర్మ తేజ, అస్లాం కేఈ
బీజీఎం: అస్లాం కేఈ
డైలాగ్స్: అమ్మ రాజశేఖర్ అండ్ టీం
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: రాధ రాజశేఖర్
ఆర్ట్ డైరెక్టర్: రామకృష్ణ
డ్యాన్స్ కొరియోగ్రాఫర్స్: అమ్మ రాజశేఖర్
లిరిసిస్ట్స్: ధర్మతేజ
ఎడిటర్ : శివ సామి
పీఆర్వో: మధు వీఆర్
డిజిటల్ మీడియా : డిజిటల్ దుకాణం

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు శుభవార్త: కరెంట్ చార్జీలు తగ్గబోతున్నాయ్

చంద్రబాబు-పవన్ కల్యాణ్‌లను విడదీయడం అసాధ్యం: పేర్ని నాని (video)

కాకినాడలోని ఆనంద నిలయం సోషల్ వెల్ఫేర్ హాస్టల్‌లో డైనింగ్ హాల్ నిర్మాణానికి కోరమాండల్ ఇంటర్నేషనల్ చేయూత

Navratri Viral Videos: గర్బా ఉత్సవంలో ఆ దుస్తులేంటి? వీడియో వైరల్

Digital Book: డిజిటల్ పుస్తకాన్ని ప్రారంభించిన వైఎస్ జగన్.. వైకాపా మహిళా నేతపైనే ఫిర్యాదు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులు రోజుకి ఎన్ని తినాలి? ప్రయోజనాలు ఏమిటి?

ఒక్క లవంగాను నోట్లో వేసుకుని నమిలితే...

థాంక్స్-ఎ-డాట్ కార్యక్రమంతో రొమ్ము క్యాన్సర్ పట్ల ఎస్‌బిఐ లైఫ్, బిసిసిఐ అవగాహన

టైప్ 1 మధుమేహం: బియాండ్ టైప్ 1 అవగాహన కార్యక్రమం

అధిక ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌కు చికిత్స చేయడం మెరుగైన గుండె ఆరోగ్యానికి దశల వారీ మార్గదర్శి

తర్వాతి కథనం
Show comments