Webdunia - Bharat's app for daily news and videos

Install App

వ్యభిచారం చేస్తావా లేదా.. 'చిన్నారి పెళ్లికూతురు'ని వేధించిన ప్రియుడు... అందుకే సూసైడ్

ముంబైలో బుల్లితెర నటి ప్రత్యూష బేనర్జీ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సలృష్టించింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యభిచారం చేయాలని ప్రత్యూషను ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఒత్

Webdunia
శనివారం, 5 నవంబరు 2016 (15:41 IST)
ముంబైలో బుల్లితెర నటి ప్రత్యూష బేనర్జీ ఆత్మహత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సలృష్టించింది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యభిచారం చేయాలని ప్రత్యూషను ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ ఒత్తిడి చేసినట్టు తెలుస్తోంది. వారిద్దరి మధ్య ఫోన్లలో చివరిసారిగా జరిగిన సంభాషణలను 'ముంబై మిర్రర్' వెల్లడించింది. మూడు నిమిషాల నిడివున్న ఈ ఫోన్ సంభాషణలు ప్రత్యూష్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు జరిగినట్టు తెలిపింది. 
 
'నన్ను నేను అమ్ముకోవడానికి ఇక్కడికి రాలేదు. నటించడానికి, పనిచేయడానికే ఇక్కడికి వచ్చాను. కానీ ఈరోజు నన్ను నువ్వు ఎక్కడ ఉంచావు? రాహుల్... నీకు తెలీదు ఇప్పుడు నేనెంతగా కుమిలిపోతున్నానో. నువ్వు స్వార్థపరుడివి. నా పేరును చెడగొట్టావు. జనం నన్ను, నా తల్లిదండ్రుల గురించి చెడుగా మాట్లాడుకుంటున్నార'ని ప్రత్యూష ఫోన్‌లో వాపోయింది. 
 
వ్యభిచారం చేయమని ప్రత్యూషను రాహుల్ ఒత్తిడి చేశాడని ఆమె తరపు న్యాయవాది నీరజ్ గుప్తా ఆరోపించారు. ప్రత్యూష చివరిసారిగా రాహుల్‌తో ఫోన్‌లో మాట్లాడినప్పుడు 'వ్యభిచారం' అనే పదం వాడిందని తెలిపారు. అయితే ఎలాగైనా డబ్బు సంపాదించాలని ప్రత్యూషపై ఆమె తల్లిదండ్రులే ఒత్తిడి తెచ్చారని రాహుల్ అంతకుముందు చెప్పడం కొసమెరుపు.  
అన్నీ చూడండి

తాజా వార్తలు

దేవుడు అన్నీ చూస్తున్నాడు... దేవుడు శిక్షిస్తాడు : చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆగ్రహం

శ్రీలంకలో భారతీయ మైస్ కార్యకలాపాలు విస్తృతం: హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో శ్రీలంక టూరిజం ప్రోగ్రాం

సీఎం సిద్ధరామయ్యకు ఉద్వాసన : కర్నాకటకలో రాజకీయ గందరగోళం!!

దేశ చరిత్రలో తొలిసారి : సుప్రీంకోర్టు ఉద్యోగాల్లో ఎస్సీఎస్టీలకు రిజర్వేషన్లు

జలపాతం వరద: చావు చివరికెళ్లి బతికి బయటపడ్డ ఆరుగురు మహిళలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మిరప కారం చేసే మేలు ఎంతో తెలుసా?

నిద్రకు 3 గంటల ముందే రాత్రి భోజనం ముగించేస్తే ఏం జరుగుతుంది?

పరగడుపున తినకూడని 8 పండ్లు

కొలెస్ట్రాల్‌ను నియంత్రించుకోవడానికి సహాయపడే 4 ఆహారాలు

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

తర్వాతి కథనం
Show comments