Webdunia - Bharat's app for daily news and videos

Install App

సినీ పెద్దల ఆశీర్వాదం వద్దు... పెద్దలను ప్రశ్నించేవాడు కావాలి : ప్రకాష్ రాజ్

Webdunia
సోమవారం, 4 అక్టోబరు 2021 (14:23 IST)
తనకు తెలుగు చిత్రపరిశ్రమలోని సినీ పెద్దల ఆశీర్వాదం తనకు వద్దని, ఆ పెద్దలను ప్రశ్నించేవాడు ఇపుడు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా)కు అధ్యక్షుడు కావాలని "మా" ఎన్నికల బరిలో అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ప్రకాష్ రాజ్ వ్యాఖ్యానించారు. 
 
ఈ నెల 10వ తేదీ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఎన్నికలు జరుగనున్నాయి. ఈ సమయం కూడా సమీపిస్తుంది. ఈ పరిస్థితుల్లో ప్రకాష్ రాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'పెద్దల ఆశీర్వాదం నాకొద్దు. మా ఎన్నికల్లో నా సత్తాపై గెలుస్తా. పెద్దలను ప్రశ్నించే సత్తా ఉన్నవాడే అధ్యక్షుడిగా గెలవాలన్నారు. 
 
పెద్దల దయతో గెలిస్తే వాళ్ల దగ్గరకు వెళ్లి కూర్చోవాలి. మా ఎన్నికలపై ప్రశ్నిస్తే బెదిరించారు. నేను ఒక ఉత్తరం రాస్తే మా అసోసియేషన్‌కు  తాళం పడేది. సౌమ్యంగానే కాదు కోపంగా మాట్లాడటం కూడా తెలుసు. నరేష్ అహంకారి, ఒళ్లు దగ్గరపెట్టుకొని మాట్లాడాలి. మా అసోసియేషన్ సిగ్గుపడేలా నరేష్ ప్రవర్తిస్తున్నారు. 
 
నన్ను తెలుగువాడు కాదని నరేష్‌ అన్నారు. కానీ నా అంత తెలుగు మంచు విష్ణు ప్యానెల్‌లో ఎవరికి రాదు. నన్ను పెంచింది తెలుగు భాష. మా అసోసియేషన్ కోసం ఒక బాధ్యతగా పనిచేయాలని వచ్చానని చెప్పుకొచ్చారు. మా సభ్యుల్లో ఉన్న ప్రతి ఒక్కరికి ఆత్మాభిమానం ఉంది. చాలా బాధతో, ఆక్రోశంతో సమస్యలను పరిష్కరించాలని పోటీ చేస్తున్నాం. మీరు గెలవడానికి ప్రయత్నించండి, అవతలివారిని ఓడించడానికి కాదంటూ మంచు విష్ణుకు పరోక్షంగా ఆయన కౌంటర్‌ వేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

లోక్‌సభలో ప్రియాంకా గాంధీ బుగ్గలు నిమిరిన రాహుల్ : స్పీకర్ ఆగ్రహం (Video)

Telangana Cabinet expansion: కొండా సురేఖ అవుట్ విజయశాంతి ఇన్?

కామారెడ్డిలో టెన్త్ ప్రశ్నపత్రం లీక్... ముగ్గురు ఉపాధ్యాయులపై వేటు

Plane Flies Over Tirumala: అపచారం-తిరుమల శ్రీవారి ఆలయంపై ఎగరిన విమానం (video)

తోస్తే 90 చోట్ల పడేటట్టున్నాడు కానీ యువతి వెనుక వైపుకి అతడి ముందు భాగాన్ని.. (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments