Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను మళ్లీ పెళ్లి చేసుకున్నాను.. ప్రకాశ్ రాజ్

Webdunia
బుధవారం, 25 ఆగస్టు 2021 (10:18 IST)
Prakash Raj
కుమారుడు వేదాంత్‌ కోరిక మేరకు తాను రెండో సారి పెళ్లి చేసుకున్నానని విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ సామాజిక మాధ్యమం ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు. ప్రకాశ్‌ రాజ్‌ భార్య పోనీ వర్మ, తన పిల్లలతో కలిసి దిగిన ఫొటోల్ని ట్విట్టర్‌ వేదికగా అభిమానులతో ప్రకాశ్‌ రాజ్ పంచుకున్నారు. మా వివాహానికి సాక్షిగా వేదాంత్‌ ఉండాలనుకున్నాడు. అందుకే ఈ రాత్రి మేం మళ్లీ పెళ్లి చేసుకున్నాం అని ప్రకాశ్‌ రాజ్‌ తన ట్విట్‌లో తెలియజేశారు.
 
అయితే ప్రకాశ్‌ రాజ్‌ మొదటి భార్య లలిత కుమారికి విడాకులు ఇచ్చిన తర్వాత కొరియోగ్రాఫర్‌ పోనీవర్మని ప్రకాశ్‌ రాజ్‌ 2010లో వివాహం చేసుకున్న విషయం విదీతమే. కాగా ప్రస్తుతం కె.జి.యఫ్ చాప్టర్ 2, అల్లు అర్జున్‌ హీరోగా నటిస్తున్న పుష్ప చిత్రాలతో పాటు రజినీకాంత్‌ అన్నాత్తే చిత్రాలతో బిజీగా ఉన్నారు ప్రకాశ్‌ రాజ్‌. అయితే ఇటీవల ప్రకాశ్‌ రాజ్‌ చేతికి చిన్నపాటి శస్త్ర చికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా మరోవైపు మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌ (MAA) అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments