Webdunia - Bharat's app for daily news and videos

Install App

‘మా’ ఎన్నికల హడావుడి.. నామినేషన్ వేసిన ప్రకాష్ రాజ్

Webdunia
సోమవారం, 27 సెప్టెంబరు 2021 (16:37 IST)
‘మా’ ఎన్నికల హడావుడి మొదలైంది. ఇప్పటికే ‘మా’ అధ్యక్షా పదవికి పోటీ చేస్తున్న ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇంకా సివిఎల్ నరసింహ రావు వంటి అభ్యర్థులు ‘మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నప్పటికీ ప్రధానంగా విష్ణు, ప్రకాష్ రాజ్ మధ్య ఈ వార్ జరగనుంది. ఇటీవలే ప్రకాష్ రాజ్, విష్ణు తమ ప్యానెల్ లను, అందులో సభ్యులను ప్రకటించిన విషయం తెలిసిందే.
 
తాజాగా ఈ రోజు ఉదయం ప్రకాష్ రాజ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోషియేషన్ (MAA) ఎన్నికల నామినేషన్ వేశారు. ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా శ్రీకాంత్ కూడా నామినేషన్ వేశారు. నేటి నుంచి నుంచి ఈ నెల 29 వరకూ నామినేషన్లు స్వీకరణ ప్రక్రియ కొనసాగుతుంది. ఈ నెల 30న నామినేషన్ల పరిశీలన జరుగుతుంది. అనంతరం నామినేషన్‌ ఉపసంహరణకు వచ్చే నెల 1, 2 తేదీల్లో సాయంత్రం 5 గంటల వరకూ గడువు ఇస్తారు. 
 
నామినేషన్ వేసిన వారెవరైనా వెనక్కి తగ్గాలనుకుంటే… అప్పటికే వారు వేసిన నామినేషన్ ను వాపస్ తీసుకోవచ్చు. అక్టోబర్ రెండో తేది సాయంత్రం బరిలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తారు. అక్టోబర్‌ 10న ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను కూడా వెల్లడించబోతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments