డ్యూడ్ రూ.100 కోట్ల కలెక్షన్లు : హ్యాట్రిక్ కొట్టిన కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్

ఠాగూర్
గురువారం, 23 అక్టోబరు 2025 (15:35 IST)
కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ హ్యాట్రిక్ కొట్టారు. తాను నటించిన మూడు చిత్రాలు వరుసగా వంద కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టాయి. ఈ నెల 17వ తేదీన విడుదలైన 'డ్యూడ్' చిత్రం కూడా ఏకంగా రూ.100 కోట్ల కలెక్షన్లు దాటేసినట్టు చిత్ర నిర్మాతలు గురువారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు కొత్త పోస్టర్‌ విడుదల చేసింది. 'బాక్సాఫీసు వద్ద 'డ్యూడ్‌' సెంచరీ కొట్టింది. దీపావళి సీజన్‌లో బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది' అని పేర్కొంది. ఈ నెల 17న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం 6 రోజుల్లో ఈ కలెక్షన్లు రాబట్టడం గమనార్హం. 
 
కాగా ప్రదీప్ రంగనాథ్ హీరోగా నటించిన మూడు చిత్రాలు రూ.100 కోట్ల కలెక్షన్స్ రాబట్టడం గమనార్హం. గతంలో 'లవ్‌టుడే', 'డ్రాగన్' మూవీలతో పాటు ఇపుడు డ్యూడ్ మూవీ రూ.100 కోట్ల కలెక్షన్స్ సాధించింది. ఈ విజయాలతో టాలీవుడ్‌తో తనకంటూ ఓ ఇమేజ్‌ను హీరో సొంతం చేసుకున్నారు. 
 
తెలుగు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై.రవిశంకర్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు. కీర్తీశ్వరన్ దర్శకుడు. ప్రదీప్ రంగనాథన్, మమిత బైజులు హీరోహీరోయిన్లు. సాయి అభయంకర్ సంగీతం సమకూర్చారు. తమిళం, తెలుగు భాషల్లో విడుదల చేశారు. ఈ రెండు భాషల్లో కూడా చిత్ర కలెక్షన్లు అద్భుతంగా ఉండటం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైఎస్ వివేకా హత్య కేసు : అవినాశ్ రెడ్డిని కస్టడీలోకి తీసుకుని విచారించాలి : వైఎస్ సునీత

World Bank: అమరావతికి ప్రపంచ బ్యాంక్ 800 మిలియన్ డాలర్లు సాయం

బంగ్లాదేశ్ జలాల్లోకి ఎనిమిది మంది మత్స్యకారులు.. ఏపీకి తీసుకురావడానికి చర్యలు

విశాఖపట్నంలో సీఐఐ సదస్సు.. ప్రపంచ లాజిస్టిక్స్ హబ్‌గా అమరావతి

బీహార్ అసెంబ్లీ ఎన్నికలు : ముఖ్యమంత్రి అభ్యర్థిగా తేజస్వీ యాదవ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో అతి చక్కెర వాడేవాళ్లు తగ్గించేస్తే ఏం జరుగుతుందో తెలుసా?

మసాలా టీ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి?

ఆరోగ్యకరమైన కేశాల కోసం వాల్ నట్స్

ప్రపంచ ఆర్థరైటిస్‌ దినోత్సవం: రుమటాయిడ్ ఆర్థరైటిస్‌ను ముందస్తుగా గుర్తించడం ఎందుకు ముఖ్యం?

పుట్టగొడుగులు ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments