'నేను లేకపోతే నువ్వు బతకలేవు' అన్నాడు... చివరికిలా : ప్రదీప్ మృతిపై భార్య కామెంట్స్
తనతో ప్రదీప్ ఎల్లప్పుడూ ‘నేను లేకపోతే నువ్వు బతకలేవు’ అంటూ ఉండేవాడనీ, తాను ఏడిస్తే తన భర్త చూడలేకపోయేవారని, కానీ చివరకు ఇలా చేశాడంటూ బుధవారం ఆత్మహత్య చేసుకున్న టీవీ నటుడు ప్రదీప్ భార్య,
తనతో ప్రదీప్ ఎల్లప్పుడూ ‘నేను లేకపోతే నువ్వు బతకలేవు’ అంటూ ఉండేవాడనీ, తాను ఏడిస్తే తన భర్త చూడలేకపోయేవారని, కానీ చివరకు ఇలా చేశాడంటూ బుధవారం ఆత్మహత్య చేసుకున్న టీవీ నటుడు ప్రదీప్ భార్య, బుల్లితెర నటి పావని రెడ్డి బోరున విలపిస్తోంది.
తెలుగు టీవీ నటుడు ప్రదీప్ ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోన్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నార్సింగ్ పరిధిలోని అలకాపురి కాలనీ గ్రీన్ హోమ్స్‌లోని అపార్ట్‌మెంట్‌లో ఆయన ఈ ఘటనకు పాల్పడ్డాడు. అక్కడకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆయన మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.
ఆయన మృతిపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్న వేళ ప్రదీప్ భార్య పావని రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమకు ఎటువంటి ఆర్థిక సమస్యలు లేవని, కానీ, మంగళవారం రాత్రి మాత్రం మాయిద్దరి మధ్య చిన్నగొడవ జరిగిందని చెప్పింది. ఆ సమయంలో ప్రదీప్ మద్యం సేవించివున్నాడని తెలిపింది.
తనతో ప్రదీప్ ఎల్లప్పుడూ ‘నేను లేకపోతే నువ్వు బతకలేవు’ అని అంటాడని పావని తెలిపారు. తాను ఏడిస్తే తన భర్త చూడలేకపోయేవారని వ్యాఖ్యానించారు. తాము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని అన్నారు. ఆయనంటే తనకు చాలా ఇష్టమని చెప్పింది. ఆయన ఆత్మహత్య చేసుకుంటాడని తాను అస్సలు అనుకోలేదని తెలిపారు.
ప్రదీప్ వాళ్ల తల్లి, సోదరులు చెన్నైలో ఉంటారని తెలిపారు. క్షణికావేశంలో ప్రదీప్ ఇటువంటి నిర్ణయం తీసుకొని ఉండవచ్చని, ఆత్మహత్య చేసుకునేంత గొడవలు తమ మధ్య ఏమీ లేవని చెప్పారు. చిన్న చిన్న గొడవలు ఉన్నాయని, అయితే, చిన్న గొడవకే ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో అర్థం కావట్లేదని తెలిపారు.
మంగళవారం రాత్రి స్నేహితుడు శ్రవణ్ పుట్టినరోజు వేడుకలు ఇంట్లో జరుపుకున్నామనీ, ఈ పార్టీలో తమ కుటుంబ సభ్యులంతా పాల్గొన్నారని చెప్పింది. ఆ తర్వాత ఆయన వెళ్లి రూంలో పడుకున్నాడనుకున్నానని, అయితే, రూంలోకి వెళ్లిన తన భర్త లోపల డోర్ లాక్ చేసుకొన్నాడని తెలిపారు. కాసేపటికి డోర్ కొట్టానని, ఫోన్ చేశానని, అయినా రూంలోని తన భర్త నుంచి స్పందన రాలేదని, దీంతో తన సోదరుడి సాయంతో తలుపులు బద్దలు కొట్టామని తెలిపారు.
అనంతరం అంబులెన్స్‌కి కూడా కాల్ చేశామని అన్నారు. కానీ, ఆంబులెన్స్ సిబ్బంది పరిశీలించి ప్రదీప్ చనిపోయినట్టుగా నిర్ధారించారని చెప్పారు. కాగా, దీనిపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా, ప్రదీప్ ఆత్మహత్య కేసులో శ్రవణ్‌తో పాటు పావని రెడ్డిపై అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి.