Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు!!

వరుణ్
మంగళవారం, 30 ఏప్రియల్ 2024 (11:21 IST)
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారు. వీరిలో ఒకరు బాలీవుడ్ హీరోయిన్ కియారా అద్వానీ కాగా, మరొకరు నయనతారను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా "కల్కి" తెరకెక్కుతుంది. మరోవైపు, "రాజాసాబ్" చిత్రం రూపుదిద్దుకోనుంది. ఈ సినిమాల్లో ప్రభాస్‌కి సంబంధించిన పోర్షన్ షూటింగును త్వరలోనే పూర్తికానున్నాయి. ఆ తర్వాత నుంచి ఆయన సందీప్ రెడ్డి వంగాతో కలిసి సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. డిసెంబరు నుంచి స్పిరిట్ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరుగనుంది. 
 
ఈ "స్పిరిట్" చిత్రంలో ఇద్దుర హీరోయిన్లను ఎంపిక చేయాలని భావిస్తున్నారు. ఒక హీరోయిన్ పాత్ర కోసం కియారా అద్వానీని, మరో హీరోయిన్ పాత్ర కోసం నయనతారను సంప్రదిస్తున్నట్టుగా తెలుస్తుంది. నిజంగా ఈ ఇద్దరినీ తీసుకోవడం జరిగితే ఈ సినిమాపై అంచనాలు ఒక రేంజ్‌లో పెరిగిపోవడం ఖాయంగా తెలుస్తుంది. 
 
దక్షిణాది ప్రేక్షకుల్లో కియారా అద్వానీకి మంచి క్రేజ్ ఉంది. ఇక నయనతారకున్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాగే, "జవాన్" సినిమాతో కూడా నయనతార మార్కెట్ బాలీవుడ్‌లోనూ పెరిగిపోయింది. దీంతో స్పిరిట్ చిత్రంపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. కాగా, ఈ ప్రాజెక్టును రూ.200 కోట్ల వ్యయంతో నిర్మించనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కోలుకుంటున్న డిప్యూటీ సీఎం పవన్ కుమారుడు మార్క్ శంకర్ (photo)

కాబోయే అత్తతో లేచిపోయిన కాబోయే అల్లుడు

కదిలే రైలులో సెల్ ఫోన్ కొట్టేయబోయి అడ్డంగా దొరికిన దొంగ, రైలుతో ఈడ్చుకెళ్లారు (video)

ఎయిర్ ఇండియా విమానంలో తోటి ప్రయాణీకుడిపై మూత్ర విసర్జన

పూణేలో భూటాన్ మహిళపై సామూహిక అత్యాచారం.. పార్టీల కంటూ తీసుకెళ్లి?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

తర్వాతి కథనం
Show comments