Webdunia - Bharat's app for daily news and videos

Install App

సాహో సెకండ్ పోస్ట‌ర్ అదిరింది... కానీ...?

Webdunia
మంగళవారం, 28 మే 2019 (21:38 IST)
యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న భారీ చిత్రం సాహో. ఈ చిత్రానికి ర‌న్ రాజా ర‌న్ ఫేమ్ సుజిత్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ భారీ క్రేజీ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఇటీవ‌ల ఈ మూవీ నుంచి ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన ప్ర‌భాస్ ఈ రోజు సెకండ్ పోస్ట‌ర్ రిలీజ్ చేసారు. ప్ర‌భాస్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఈ పోస్టర్‌ను తన డార్లింగ్స్‌తో పంచుకున్నారు. 
 
ఫ‌స్ట్ పోస్టర్‌లో కళ్లద్దాలు పెట్టుకుని సీరియస్ లుక్‌లో కనిపించిన ప్రభాస్.. ఈ పోస్టర్‌లో బైక్ పై ర‌య్ ర‌య్ మంటూ వెళుతున్నట్టు క‌నిపించారు. 
 
ఇటీవ‌లే ఓ పోస్ట‌ర్ రిలీజ్ చేసిన ప్ర‌భాస్ ఇంత త్వ‌ర‌గా సెకండ్ పోస్ట‌ర్ చేయ‌డం వెన‌క బ‌ల‌మైన కార‌ణం ఉంద‌ని టాక్ వినిపిస్తుంది. మ్యాట‌ర్ ఏంటంటే... ఈ సినిమా మీద ఇప్ప‌టివ‌ర‌కు ఆశించిన స్ధాయిలో బ‌జ్ రాలేదు. అందుక‌నే టీమ్ టెన్ష‌న్ ప‌డుతుంద‌ట‌. 
 
అందుక‌నే ఇక నుంచి ఈ సినిమా గురించి ఏదొక‌టి వార్త‌ల్లో ఉండేలా ప్లాన్ చేస్తున్నార‌ట‌. అందుక‌నే సెకండ్ పోస్ట‌ర్ రిలీజ్ చేసార‌ని తెలిసింది.  
 
ప్రభాస్ సరసన బాలీవుడ్ భామ శ్రద్ధా కపూర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. మురళీశర్మ, జాకీ ష్రాఫ్, ఎవ్లీన్‌ శర్మ, నీల్‌ నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్, మందిర బేడీ ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఏమాత్రం రాజీప‌డ‌కుండా యు.వి. క్రియేష‌న్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తుంది. ఆగ‌ష్టు 15న ఈ సినిమాని ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నారు. మ‌రి... సాహో అంచ‌నాల‌ను అందుకుంటుందా...? లేదో..?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments