Webdunia - Bharat's app for daily news and videos

Install App

Prabhas: హోంబాలేతో ఫిలింస్ తో ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం

దేవీ
బుధవారం, 16 జులై 2025 (14:58 IST)
Prabhas, Homble vijay
హోంబాలేతో ఫిలింస్ తో  ప్రభాస్ మూడు చిత్రాల ఒప్పందం గురించి విషయాలు తెలియజేశాడు. ఆ బేనర్ తో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్-1 చిత్రం చేశాడు. ఇప్పుడు సీక్వెల్ కూ ప్లాన్ చేస్తున్నారు. అయితే కొంత ఆలస్యం అయ్యేట్లు వుంది. కన్నడ పాపులర్ నిర్మాత విజయ్ కిరగందూర్ ఇటీవలే ది హాలీవుడ్ రిపోర్టర్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు తెలియజేశాడు.
 
సలార్ 2 తప్పనిసరిగా వుంటుందని ఆయన అన్నారు. అంతేకాక ప్రభాస్ తో తమకున్న అనుబంధంలో మూడు సినిమాను ప్లాన్ చేస్తున్నట్లు చెప్పారు. ఇంకా విజయ్ మాట్లాడుతూ, అసలు బడ్జెట్ తో సంబంధంలేదు. క్వాలిటీతో కూడిన కంటెంట్ సినిమాలకు పెద్ద పీఠవేస్తామని, అందుకు తగిన విధంగా సినిమాలు నిర్మిస్తామనీ, దానికి తగువిధంగా హాలీవుడ్ స్థాయిలోని సాంకేతికతను ఉపయోగించుకుంటామని తెలిపారు.
 
దీనిపై  ప్రభాస్ మాట్లాడుతూ "కిరగందూర్ గారి అభిరుచి, నిర్మాణ సంస్థను మిగతా వాటి నుండి ప్రత్యేకంగా నిలబెట్టింది" అని  అన్నారు. "అతను ప్రేక్షకులను, తన సిబ్బందిని జాగ్రత్తగా చూసుకునే విధానం కూడా అంతే బాగుంది. అతను చాలా సాఫ్ట్ గా ఉంటాడు, అన్ని విషయాల్లో స్థిరంగా ఉంటాడు. అందుకే మేము కుటుంబంలా మారాము, మేము కలిసి సినిమాలు ప్లాన్ చేస్తున్నాము." అని వివరించారు.

ప్రభాస్ ఇటీవలే మంచు విష్ణు నిర్మించిన కన్నప్పలో నటించారు. తాజాగా మారుతీ దర్శకత్వంలో రాజా సాబ్ షూటింగ్ లో వుంది. మరోవైపు సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తానూ ఓ మహిళే అన్న సంగతి మరిచిన వార్డెన్.. విద్యార్థినిల స్నాల గదిలో సీక్రెట్ కెమెరా అమర్చింది...

నా కోడలికి వివాహేతరం సంబంధం, భరించలేకే నా కొడుకు సూసైడ్: తల్లి ఆరోపణ

పాకిస్థాన్‌లో మరో కొత్త రాజకీయ పార్టీ.. ఎవరు స్థాపించారంటే...

బస్సులో డెలివరీ.. బిడ్డను కిటికీలో నుంచి విసిరేసిన తల్లి...

అక్రమ సంబంధం పెట్టుకుందన్న మహిళను చెట్టుకు కట్టేసి చితకబాదారు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

తర్వాతి కథనం
Show comments