మిర్చి ఘాటుకు తర్వాత బాహుబలి.. రాధాకృష్ణ సినిమాలో జ్యోతిష్కుడిగా ప్రభాస్..!
మిర్చి ఘాటుకు తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ఆపై రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న బాహుబలికి సినిమాకు అంకితమైపోయారు. అయితే ''బాహుబలి-2" తర్వాత రెండు సినిమాలు సంతకాలు చేసేశారు. రెండింటిలో ఒకటి "జిల్"
మిర్చి ఘాటుకు తర్వాత యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్.. ఆపై రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న బాహుబలికి సినిమాకు అంకితమైపోయారు. అయితే ''బాహుబలి-2" తర్వాత రెండు సినిమాలు సంతకాలు చేసేశారు. రెండింటిలో ఒకటి "జిల్" చిత్ర దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
రాధాకృష్ణ ప్రస్తుతం ప్రభాస్ కోసం ఓ కథని సిద్ధం చేశారు. హస్త సాముద్రికం నేపథ్యంలో సాగే సినిమా అని సమాచారం. ఇందులో చేయి చూసి భవిష్యత్తు చెప్పేస్తుంటాడట రెబెల్ స్టార్. దానికి చక్కటి ప్రేమకథ కూడా జోడించారని తెలుస్తోంది.
కథ వినగానే ప్రభాస్ ఓకే చేశారని.. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కించే అవకాశాలున్నట్లు సమాచారం. బాహుబలి సినిమా ద్వారా యంగ్ రెబల్‌స్టార్‌కి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించింది. ఇక రాధాకృష్ణ సినిమా వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది.
ఈ సినిమా గురించి రాధాకృష్ణ మాట్లాడుతూ -" ప్రేమకథా చిత్రమిది. పూర్తిగా విదేశాల్లోనే చిత్రీకరిస్తాం. ప్రభాస్ పక్కన హీరోయిన్‌గా కొత్త అమ్మాయిని ఎంపిక చేయాలనుకుంటున్నాం" అని తెలిపారు.