పెళ్లిపీటలెక్కనున్న హీరో ప్రభాస్.. ట్వీట్ చేసిన బాహుబలి!!

ఠాగూర్
శుక్రవారం, 17 మే 2024 (13:04 IST)
టాలీవుడ్‌లో మోస్ట్ బ్యాచిలర్ హీరోగా ఉన్న ప్రభాస్ త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించినట్టు ఆయన ఫ్యాన్స్ చెబుతున్నారు. "డార్లింగ్స్.. ఫైనల్‌గా నా జీవితంలోకి అత్యంత స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. వెయిట్ చేయండి" అంటూ ప్రభాస్ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల్లో వెల్లడించారు. దీంతో ప్రభాస్ త్వరలోనే పెళ్ళి చేసుకోబోతున్నారనే ప్రచారం జోరుగా సాగుతుంది. దీంతో ఆయన అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయాయి. ప్రభాస్ గతంలో ఎన్నడూ తన సినిమాల గురించి ఇలా ప్రత్యేకంగా చెప్పలేదు. కానీ, తన పెళ్ళి వార్తను మాత్రం ఇన్‌స్టావేదికగా షేర్ చేయడం ఇపుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 
 
కాగా, గతంలో హీరోయిన్ అనుష్కను పెళ్ళిచేసుకోబోతున్నారంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తలపై ఆయన స్పందించారు. తామిద్దరం మంచి స్నేహితులమని క్లారిటీ ఇచ్చారు. ఆ తర్వాత హీరోయిన్ కృతిసనన్, ప్రభాస్ ప్రేమించుకుంటున్నారని ప్రచారం జరిగింది. 'ఆదిపురుష్' సినిమా తర్వాత వీరిద్దరూ చాలా సన్నిహితంగా ఉన్నారు. ఆ తర్వాత కృతి సనన్ మరో వ్యక్తితో రిలేషన్‌లో ఉన్న విషయం వెలుగులోకి వచ్చిన విషయం తెల్సిందే. ఇపుడు ప్రభాస్ ఇన్‌స్టా స్టేటస్‌లో పెళ్ళి ప్రస్తావన చేయడంతో ఇపుడు మరోమారు చర్చ మొదలైంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

శ్రీలంక తీరంలో తీవ్ర వాయుగుండం - దిత్వాహ్‌గా నామకరణం

Vizag: వైజాగ్‌లో 400 ఎకరాల్లో రిలయన్స్ డేటా సెంటర్

ఆ ఆటో డ్రైవర్ నిజాయితీకి నిలువుటద్దం... బ్యాగు నిండా డబ్బు దొరికినా... (వీడియో)

అమరావతిలో రూ.260 కోట్లతో శ్రీవారి ఆలయం.. శంకుస్థాపన చేసిన ఏపీ సీఎం చంద్రబాబు

సర్పంచ్ కుర్చీ కోసం ఆగమేఘాలపై వివాహం - తీరా చూస్తే ఆశలు గల్లంతయ్యాయి..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సీతాఫలం పండును ఎవరు తినకూడదు... తింటే విషం తీసుకున్నట్టే?

డయాబెటిస్ వున్నవారు తెలుసుకోవాల్సిన విషయాలు

భారతదేశంలో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ బాధిత రోగులలో జీవించే అవకాశాలు కేవలం 3 శాతం మాత్రమే.. కానీ...

పెద్దపేగు కేన్సర్‌కు చెక్ పెట్టే తోక మిరియాలు

నెక్స్ట్-జెన్ AIతో జనరల్ ఇమేజింగ్‌: R20 అల్ట్రాసౌండ్ సిస్టమ్‌ను ప్రారంభించిన శామ్‌సంగ్

తర్వాతి కథనం
Show comments