Webdunia - Bharat's app for daily news and videos

Install App

తండ్రి జ్ఞాప‌కార్థం కారు కొన్న ప్రభాస్!

Webdunia
సోమవారం, 29 మార్చి 2021 (07:04 IST)
Prabhas new car
బాహుబలి సినిమా తర్వాత డార్లింగ్‌ హీరో ప్రభాస్‌ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. 'సాహో' సినిమాతో ఆయన హిందీ మార్కెట్‌ పరిధి విస్తరించింది. సౌత్‌ ఇండియా స్టార్‌గా ఎదిగిన ఈ హీరో అన్ని భాషల ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేసేందుకు పాన్‌ ఇండియా రూటును ఎంచుకున్నారు. ఈ క్రమంలో ఆదిపురుష్‌, రాధేశ్యామ్‌, సలార్‌తో పాటు నాగ్‌ అశ్విన్‌తో మరో సినిమా చేస్తున్నారు ప్రభాస్. 
 
ప్రభాస్ రాధేశ్యామ్ చిత్రం దాదాపు పూర్తి కావాల్సి వస్తోంది. త‌ర్వాత‌ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తోన్న సలార్ పోస్టర్లతోనే సిద్ధం చేశారు. మ‌రోవైపు ఆది పురుష్ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఓం రావత్ తెరకెక్కిస్తోన్న ఈ ప్రాజెక్ట్‌లో రాముడిగా ప్రభాస్ కనిపించబోతోన్నారు. ఇక నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కూడా రెడీగా ఉంది. ఇవన్నీ కూడా పాన్‌ ఇండియా సినిమాలే కావడం విశేషం. అందుకే వ‌రుస షూటింగ్‌ షెడ్యూల్‌ను దృష్టిలో పెట్టుకుని ప్రభాస్‌ ముంబైలో ఓ ఇల్లు కొనుక్కునే వేటలో వున్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. స‌రిగ్గా అదే టైంలో ముంబైలో జాతిర‌త్నాలు టీమ్‌కూడా ప్ర‌భాస్‌ను ఇంటి ద‌గ్గ‌ర క‌లిసింది. 
 
Prabhas new car
అయితే తాజాగా ఆయ‌న \ఓ ఖరీదైన కారును సొంతం చేసుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. లంబోర్గిని అవెంటాడర్‌ ఎస్‌ రోడ్‌స్టర్‌ కారును ప్రభాస్‌ కొనుగోలు చేసినట్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం ఈ కారు హైదరాబాద్‌ చేరుకుంది. తన ఫాదర్ జయంతి సందర్భంగా ప్రభాస్ ఈ కారు కొనుగోలు చేసిన‌ట్లు స‌మాచారం. ఈ మేరకు పలు ఫొటోలు, వీడియోలు నెట్టింట హల్‌చల్‌ చేస్తున్నాయి. ఈ కారు ధర సుమారు ఏడు కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా ప్రభాస్‌కు ఇప్పటికే బీఎమ్‌డబ్ల్యూ 520D, ఇన్నోవా క్రిస్టా, జగువార్‌ ఎక్స్‌జేఎల్‌, రేంజ్‌ రోవర్‌ వోగ్‌, రోల్స్‌ రాయ్స్‌ గోస్ట్‌ కార్లు ఉన్నట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నేను తప్పు చేసానని తేలితే అరెస్ట్ చేస్కోవచ్చు: పోసాని కృష్ణమురళి

కట్టుకున్నోడికి పునర్జన్మనిచ్చిన అర్థాంగి.. కాలేయం దానం చేసింది.. (video)

స్నేహితుడి పెళ్లిలో గిఫ్ట్ ఇస్తూ గుండెపోటుతో కుప్పకూలి యువకుడు మృతి (video)

మహారాష్ట్ర, జార్ఖండ్‌లో గెలుపు ఎవరిది.. ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తున్నాయ్.. బీజేపీ?

లోన్ యాప్‌లు, బెట్టింగ్ సైట్‌ల భరతం పడతాం... హోం మంత్రి అనిత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వాయు కాలుష్యంలో హృద్రోగులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

హెల్దీ లివర్ కోసం పాటించాల్సిన చిట్కాలు

రోజూ కొన్ని బాదంపప్పులు తీసుకోండి: నేటి వేగవంతమైన జీవనశైలిలో ఆరోగ్యానికి తోడ్పడుతుంది

రక్తవృద్ధికి తోడ్పడే ఖర్జూరాలు

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండటానికి 8 చిట్కాలు

తర్వాతి కథనం
Show comments