Webdunia - Bharat's app for daily news and videos

Install App

15రకాల బిర్యానీలు.. చేపల పులుసు.. చికెన్, మటన్ లాగించిన ప్రభాస్.. అవాక్కైన రాజమౌళి.. ఎక్కడ?

బాహుబలి 2 సినిమాకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ఇంకా ఆసక్తిని రేపుతూనే ఉన్నాయి. బాహుబలి1, 2 రెండు భాగాల్లో ప్రభాస్, రానాల దేహ దారుఢ్యాన్ని, భారీకాయాల్ని చూసి జనం బిత్తరపోయారు. వీళ్లు ని

Webdunia
మంగళవారం, 6 జూన్ 2017 (05:40 IST)
బాహుబలి 2 సినిమాకు సంబంధించి వెలుగులోకి వస్తున్న కొత్త విషయాలు ఇంకా ఆసక్తిని రేపుతూనే ఉన్నాయి. బాహుబలి1, 2 రెండు భాగాల్లో ప్రభాస్, రానాల దేహ దారుఢ్యాన్ని, భారీకాయాల్ని చూసి జనం బిత్తరపోయారు. వీళ్లు నిజంగా మనుషులేనా.. రాజుల కాలంలో అంత భారీకాయులు ఉండేవారా, ఇవి వారి నిజదేహాలా లేక గ్రాఫిక్స్ దేహాలా అనే అనుమానాలను ఇప్పటికీ హిందీ మీడియానే కాదు హాలీవుడ్‌లో కూడా పలువురు సంధిస్తూనే ఉన్నారు. రెండో భాగం చూస్తే మీకే తెలుస్తుంది అని భళ్లాలదేవ పాత్రధారి రానా చెప్పినప్పటికీ మీడియాకు ఇంకా అనుమానం పోలేదు. 
 

అవును మరి... సినిమా కోసం ప్రభాస్‌, రానాలు తమ దేహాన్ని ఎంత ఫిట్‌నెస్‌గా ఉంచుకున్నారో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ నిజంగానే ప్రభాస్, రానాలు భారీ కాయులుగా మారడానికి కుంభాల కొద్దీ ఆహారం తీసుకున్నారట. కండలు తిరిగిన ప్రభాస్‌ దేహం వెనుక బిర్యానీ మాయ ఉందంట. స్వయంగా చిత్రదర్శకుడు రాజమౌళే ఈ విషయాన్ని బయటపెట్టారు. అమరేంద్ర బాహుబలి, మహేంద్ర బాహబలి, భళ్లాలదేవ పాత్రల్లో భారీతనం కనబడటానికి వారి ఆహారం విషయంలో పూర్తి స్వేచ్ఛను ఇచ్చానని, కానీ తాను కోరుకున్నట్లుగా వారి దేహల్లో ఖచ్చితంగా తయారు కావడానికి ఒక వైపు క్రమబద్ధమైన తిండి, మరోవైపు వ్యాయామాలను వారు నెలల తరబడి కొనసాగించారని రాజమౌళి తెలిపారు. ఇవి రెండూ పాటించకపోతే అంత పర్‌ఫెక్ట్ దేహాలు వారికి ఏర్పడి ఉండేవి కావని చెప్పారు. 
 
"బాహుబలి షూటింగ్ సమయంలో వాళ్లు(ప్రభాస్‌, రానా) ఎలాంటి డైట్‌ఫాలో అయినా నేను అడ్డు చెప్పే వాడిని కాదు. వారిపై ఒత్తిడి కూడా చేయలేదు.. కానీ ప్రభాస్ గురించి ఒక సరదా విషయం మీకు చెప్పాలి. సినిమా కోసం ప్రభాస్, రానా ఇద్దరూ నిర్దిష్ట పద్దతిలో డైటింగ్ చేసేవారు. నెలరోజులకు ఒక్కసారి వారు తమకు ఇష్టమైన తిండి ధారాళంగా లాగించేవారు. ప్రభాస్ విషయం అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. నెలలో ఆ ఒక్కరోజు తన ఇంటినుంచి 15 రకాల బిరియానీలను తెప్పించి లాగేంచేవాడు. అది చీట్ మెయిల్.  ఇది అతిశయోక్తి కాదు. నిజం. మనకయితే అన్ని బిరియానీలు ఉన్నాయనే విషయం కూడా తెలీదు. ఫిష్ బిరియానీ, చికెన్ బిరియానీ, మటన్ బిరియానీ, ఇక కర్రీస్, వేపుళ్లు అయితే చెప్పాల్సిన పనిలేదు. అన్నిరకాల బిరియానీలు ఒక చోట  కనబడితే ఎలా ఉంటుందో మీరు ఊహించుకోవాల్సిందే. ప్రభాస్ బ్రదరిన్ లా ని నేను అదే అడిగేను. ఏమండి మీ ఇంట్లో ఇన్ని రకాల బిరియానీలు చేస్తారు. తిండి పెట్టి చంపేస్తారా మనుషులను అని అడిగాను. దానికి ఆయన సమాధానం చెప్పాడు.  ఇన్ని వెరయిటీలు చేసినా ప్రభాస్ మరొకటేది తక్కువయింది కదా అని అంటాడు. ఒకరోజు నిజంగానే ప్రభాస్ తెల్లవారు జామునే వాలీబాల్ ఆడి బోజనానికి వచ్చాడు. అప్పటికే తన బావమరిది బిరియానీలు తీసుకొచ్చాడు. ముందు 15 రకాల బిరియానీలు ఉంటే చూస్తూనే నెయ్యి తొక్కు పచ్చడి లేదా బావా అనడిగేశాడు, ప్రభాస్ అలా అనగానే తన బావమరిది నాకేసి చూసి చెప్పాను కదండీ అంటూ మళ్లీ అంత తెల్లవారు జామున రామోజీ ఫిల్మ్ సిటీనుంచి ఇంటికి వెళ్లి, తన భార్యను అంత పొద్దున్నే లేపి ప్రభాస్ అడిగిన నెయ్యి తొక్కు పచ్చడి చేయించి తీసుకుని వచ్చాడు. దాన్ని తిన్న తర్వాతే ప్రభాస్ మిగతా వాటి జోలికి వెళ్లేవాడు. ఇన్ని బిరియానీలు ఉన్నా కూడ చట్నీ లేకుండే ప్రభాస్ తిండి మొదలెట్టేవాడు కాదు" అని రాజమౌళి యునైటెడ్ కింగ్‌డమ్ లోని బ్రిటిష్ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో ఇటీవల పాల్గొన్న సమావేశంలో చెబుతుంటే  హాజరైన వారు పకపకా నవ్వారు. 
 
ప్రభాస్, రానాలు ఇద్దరూ అంత నాలుగేళ్ల పాటు తమ శరీరాలను ఆ స్థాయిలో కొనసాగించడం మామూలు విషయం కాదని, ఎందుకంటే వారు పాత్రలకు తగినట్లు యవ్వన జీవితాన్ని, తదనంతర జీవితాలను పోషించాల్సి వచ్చిందని రాజమౌళి చెప్పారు. అలాంటి నిబద్ధత ప్రదర్శించినందుకు వారికి హ్యాట్సాప్ చెప్పాలన్నారు. 
 
విడుదలైన ఆరువారాల పైబడినప్పటికీ ఐమాక్స్‌లో, మల్టీప్లెక్స్‌ లలో ఆదివారం సెకండ్ షోలుకూడా హౌస్ ఫుల్ అవుతున్న అసాధారణ ఘనతను బాహుబలి 2 చేజిక్కించుకుంది. వసూళ్ల పరంగా భారతదేశంలోనే కాకుండా మొత్తం ప్రపంచ దేశాల్లో కూడా ఈ సినిమా దుమ్మురేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికీ పలురకాలుగా బాహుబలి 2 మానియా కొనసాగుతోంది.
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Deputy CM ట్రెండ్, 10 వేల మంది జీవితాలు పోతాయ్ అంటారా? సీజ్ ది షిప్ అంటూ పవన్ కల్యాణ్

రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిపై గాడిద దాడి.. కాలికి తీవ్రగాయం వీడియో వైరల్

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం... ఆ రెండు పోర్టులకు ప్రమాద హెచ్చరికలు

పోర్టులోకి రైస్ ఎలా వస్తుంది? డిప్యూటీ సీఎం అయిన నాకే సహకారం లేదు: పవన్ విస్మయం (video)

వైనాట్ 175 అన్నారు.. చివరకు 11 వచ్చాయి.. అయినా మార్పు రాలేదు : జగన్‌పై బాలినేని ఫైర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Mint Juice, శీతాకాలంలో పుదీనా రసం తాగితే?

లెమన్ టీ తాగుతున్నారా? ఐతే వీటిని తినకండి

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments