Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెదనాన్న మృతి.. అయినా ఫ్యాన్స్ కోసం డార్లింగ్ ఏం చేశాడంటే..? (వీడియో)

Webdunia
బుధవారం, 14 సెప్టెంబరు 2022 (10:51 IST)
prabhas
రెబల్ స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో ఆదివారం తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. అంత్యక్రియలు సోమవారం ముగిశాయి. తెలంగాణ ప్రభుత్వ అధికార లాంఛనాలతో మొయినాబాద్‏లోని కనకమామిడి ఫామ్ హౌస్‏లో రెబల్ స్టార్‏ అంత్యక్రియలు నిర్వహించి నివాళులు అర్పించారు. 
 
కృష్ణంరాజు మృతితో శోకసంద్రంలో మునిగిపోయిన ప్రభాస్.. గుండె నిండా బాధలోనూ అభిమానుల కోసం ఆలోచించారట. తన పెదనాన్న అంత్యక్రియలలో పాల్గోనేందుకు వచ్చినవారంతా తిని వెళ్లాలని భోజనం ఏర్పాట్లు చేయించారట. ఈ విషయాన్ని తెలుసుకుని సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ వీడియోలు షేర్ చేస్తూ ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
 
తన పెదనాన్న అంత్యక్రియలలో ఫ్యాన్స్‏తో ప్రభాస్ మాట్లాడుతున్న వీడియోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందరూ భోజనం చేసి వెళ్లండి అంటూ చెప్పుకొచ్చాడట ప్రభాస్. మనసులో బాధను పెట్టుకుని కూడా అభిమానుల కడుపు నింపాలని ఆలోచించిన ప్రభాస్‌పై ప్రశంసలు కురిపిస్తున్నారు. 
 
రాజు ఎక్కడున్నా రాజే.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక డార్లింగ్ తన షూటింగ్ సెట్‏లో అందరికీ సరిపడా భోజనాన్ని ఇంటినుంచే రెడీ చేయించి తీసుకెళ్తుంటాడనే సంగతి తెలిసిందే.

 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏపీకి మూడు రోజుల పాటు వర్షాలు...

జనసేనలో చేరికపై ఇపుడేం మాట్లాడలేను : మంచు మనోజ్ (Video)

పావురాల సంఖ్య పెరగడం మనుషులకు, పర్యావరణానికి ప్రమాదమా? నిపుణులు ఏం చెబుతున్నారు...

దుబాయ్‌లో పండుగ సీజన్ 2024

అంతర్జాతీయ గీతా మహోత్సవంలో మధ్యప్రదేశ్ గిన్నిస్ ప్రపంచ రికార్డ్‌

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గోరింటను చేతులకు, కాళ్లకు పెట్టుకుంటే ఫలితాలు ఏమిటి?

శీతాకాలంలో ఆరోగ్యంగా వుండేందుకు 10 చిట్కాలు

పారాసిట్మాల్ మాత్రతో తస్మాత్ జాగ్రత్త!!

Ginger Milk in winter: శీతాకాలంలో అల్లం పాలు తాగితే?

Ber fruit: రేగు పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments