Webdunia - Bharat's app for daily news and videos

Install App

''ఆదిపురుష్'' మోష‌న్ క్యాప్చరింగ్ ప్రక్రియ ప్రారంభం_ఫిబ్రవరి 2, 2021 నుంచి..?

Webdunia
మంగళవారం, 19 జనవరి 2021 (13:46 IST)
Adipurush
రెబల్ స్టార్ ప్రభాస్, సైఫ్ అలీ ఖాన్ ముఖ్యపాత్రలో తెరకెక్కుతున్నచిత్రం ఆదిపురుష్‌. ఈ చిత్రం ఎనౌన్స్ చేసిన ద‌గ్గ‌ర‌నుండి ప్ర‌పంచ‌వ్యాప్తంగా వున్న రెబ‌ల్‌స్టార్ ఫ్యాన్స్, తెలుగు ప్రేక్ష‌కులు భారీ అంచ‌నాల‌తో ఆదిపురుష్ అప్‌డేట్స్‌ని ఫాలో అవ్వ‌టం ఈ ప్రాజెక్ట్‌పై వున్న క్రేజ్‌ని తెలియ‌జేస్తుంది. భార‌త‌దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక చిత్రంగా తెర‌కెక్కుతున్న‌ ఆదిపురుష్ మోషన్ క్యాప్చర్ షూటింగ్ ఈ రోజు అన‌గా జ‌న‌వరి 19 న మొదలైంది. 
 
ఈ సందర్భంగా భూషణ్ కుమార్ మాట్లాడుతూ.. టి సిరీస్‌లో కొత్త ఐడియాలు, కొత్త కాన్సెప్ట్‌లు ఎప్పుడూ మేము ఎంకరేజ్ చేస్తూనే ఉన్నాం. ఫిలిం మేకింగ్‌లో సరికొత్త టెక్నాలజీని వాడుకుంటూనే ఉన్నాం. ఓం ఆయన టీం కలిసి ఆదిపురుష్ లాంటి ఒక అద్భుతమైన ప్రపంచాన్ని సృష్టిస్తున్నారు. దానికోసం ఇంటర్నేషనల్ సినిమాలో వాడే లేటెస్ట్ టెక్నాలజీ వాడుకుంటున్నారు. తొలిసారి ఇండియాలో అంత భారీ టెక్నాలజీని ఉపయోగించుకోబోతున్నాం. బాహుబ‌లి స్టార్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న ఈ  అద్భుతాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాం.. అని తెలిపారు.
 
నిర్మాత ప్రసాద్ సుతార్ మాట్లాడుతూ.. సాధారణంగా ఇంటర్నేషనల్ సినిమాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకమైన విజువల్ ఎఫెక్ట్స్ వాడుతుంటారు. ఫిలిం మేకర్స్ కు వాళ్ళ కథ చెప్పడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఆదిపురుష్ లాంటి ఒక అద్భుతమైన ప్రపంచం సృష్టించడానికి మేము కూడా ఇదే చేయబోతున్నాం. ఈ సినిమా మా అందరికీ ఒక ఒక మైలురాయి లాంటిది. భూషణ్ జీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా వేచి చూస్తున్నాము.. అని తెలిపారు.
 
రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ న‌టిస్తున్న , ఓం రౌత్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టి సిరీస్ బానర్ పై భూషణ్ కుమార్, కృష్ణ కుమార్ నిర్మిస్తున్నారు. ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్ స‌హ నిర్మాత‌లు. ఫిబ్రవరి 2, 2021నాడు ఆదిపురుష్ రెగ్యూల‌ర్ షూటింగ్ ప్రారంభం అవ్వ‌నుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments