Webdunia - Bharat's app for daily news and videos

Install App

వాయిదా ప‌డ్డ పృథ్వీరాజ్ సుకుమారన్ కడువా చిత్రం

Webdunia
మంగళవారం, 28 జూన్ 2022 (16:02 IST)
Prithviraj Sukumaran, Samyukta Menon and others
మలయాళ సూపర్‌స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్, మాస్ డైరెక్టర్ షాజీ కైలాస్ కాంబినేషన్ తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ కడువా. పాన్ ఇండియా ఎంటర్‌టైనర్‌గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో వస్తున్న  జూన్ 30న ఈ చిత్రాన్ని  ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నట్లు తొలుత ప్రకటించారు నిర్మాతలు. అయితే కొన్ని అనివార్య కారణాల వలన సినిమా విడుదల వారం రోజులు వాయిదా పడింది. జూలై 7న సినిమాని విడుదల చేస్తున్నట్లు పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రకటించారు  ''అభిమానులు, డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్ యజమానులందరికీ క్షమాపణలు. అనుకోని పరిస్థితుల వలన 'కడువా' చిత్రం విడుదల జూలై7 కి వారం రోజుల వాయిదా పడింది. ప్రచార కార్యక్రమాలు షెడ్యూల్ ప్రకారం కొనసాగిస్తాము. ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ కి మీఅందరి ప్రేమ, మద్దతు కొనసాగాలి'' అని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు పృథ్వీరాజ్.
 
ఈ భారీ యాక్షన్ థ్రిల్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరాయ్‌ మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, 'భీమ్లా నాయక్' ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు.
ఇటివలే విడుదలైన కడువా టీజర్ యాక్షన్ మాస్ ఎంటర్‌టైనర్ గా అన్ని వర్గాల ప్రేక్షకులని అలరించి సినిమాపై భారీ అంచనాలు పెంచింది.
మ్యాజిక్ ఫ్రేమ్స్ & పృథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. జేక్స్ బిజోయ్ సంగీతం అందించారు.
తారాగణం: పృథ్వీరాజ్ సుకుమారన్, సంయుక్త మీనన్, వివేక్ ఒబెరాయ్, అర్జున్ అశోక్, సిద్ధిక్, అజు వర్గీస్, దిలీష్ పోతన్ తదితరులు.
సాంకేతిక విభాగం :
దర్శకత్వం: షాజీ కైలాస్
నిర్మాతలు: సుప్రియా మీనన్ & లిస్టిన్ స్టీఫెన్
రచన: జిను వి అబ్రహం
డీవోపీ: అభినందన్ రామానుజం
ఎడిటర్: షమీర్ మహమ్మద్
ఆర్ట్: మోహన్ దాస్
వీఎఫ్ఎక్స్  : కోకోనట్ బంచ్
సంగీతం: జేక్స్ బిజోయ్
లైన్ ప్రొడ్యూసర్ - సంతోష్ కృష్ణన్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - నవీన్ పి థామస్
ప్రమోషన్ కన్సల్టెంట్: విపిన్ కుమార్
మార్కెటింగ్: పోఫాక్టియో
డిజిటల్ పీఆర్: తనయ్ సూర్య

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కేసీఆర్ చుట్టూత కొన్ని దెయ్యాలు ఉన్నాయ్ : ఎమ్మెల్సీ కవిత

Kavitha: తెలంగాణలో మరో షర్మిలగా మారనున్న కల్వకుంట్ల కవిత? (video)

43 సంవత్సరాల జైలు శిక్ష-104 ఏళ్ల వృద్ధుడు- చివరికి నిర్దోషిగా విడుదల.. ఎక్కడ?

Bus Driver: బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. సీటులోనే కుప్పకూలిపోయాడు.. కండెక్టర్ ఏం చేశాడు? (video)

Kishan Reddy: హైదరాబాద్ నగరానికి రెండు ప్రాజెక్టులకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

ఎముక బలం తగ్గుతోందా? ఐతే ఇవి తినాలి

తర్వాతి కథనం
Show comments