Webdunia - Bharat's app for daily news and videos

Install App

నారా లోకేష్ బుద్ధిజ్ఞానం ఉందా? 'కమ్మ' నందిని తిరస్కరిస్తున్నా : పోసాని (వీడియో)

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల రచ్చ ఇపుడు మరోమలుపు తిరిగింది. నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారంతా ఎన్ఆర్ఐ (నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్)లేనని ఏపీ మంత్రి నారా లోకేష్ చ

Webdunia
మంగళవారం, 21 నవంబరు 2017 (15:10 IST)
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన నంది అవార్డుల రచ్చ ఇపుడు మరోమలుపు తిరిగింది. నంది అవార్డుల విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న వారంతా ఎన్ఆర్ఏ (నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్)లేనని ఏపీ మంత్రి నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు కారణంగా ఉన్నాయి. ఈ వ్యాఖ్యలపై సినీ రచయిత, ప్రముఖ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీ మంత్రిగా ఉన్న నారా లోకేష్‌కు కనీసం బుద్ధి జ్ఞానం ఉందా అంటూ ప్రశ్నించారు. నారా లోకేష్ వ్యాఖ్యలు తనను బాధించాయనీ, అందువల్ల ఈ నంది అవార్డును తిరస్కరిస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర విభజన చట్టం ప్రకారం హైదరాబాద్ 2024వరకు ఉమ్మడి రాజధాని అనే విషయం ఆయనకు గుర్తుందా? అంటూ సూటిగా అడిగారు. 
 
అంతేకాకుండా, ఏపీలో పన్నులు చెల్లించకుండా, ఆధార్ కార్డు, ఓటు హక్కులేని వాళ్లే నంది అవార్డులపై రచ్చ చేస్తున్నారన్నారు. పైగా, మూడేళ్ళకు కలిపి ఒకేసారి ఇచ్చిన వారిని విమర్శిస్తున్నారనీ, అసలు ఇవ్వని వారిని పల్లెత్తు మాట అనడం లేదనీ లోకేష్ అన్నారు. దీనిపై పోసాని ఆగ్రహం వ్యక్తం చేశారు. నారా లోకేష్‌కు పన్నులు ఎక్కడ చెల్లిస్తున్నారు.? ఆధార్ కార్డు ఎక్కడ ఉంది.? ఓటు ఎక్కడ వేస్తున్నారు.? లోకే‌ష్ భార్యకు, అత్తకు హైదరాబాద్‌లో ఆస్తులు లేవా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పోసాని కృష్ణమురళి మీడియా సమావేశానికి సంబంధించిన వీడియోను చూడండి. 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

భార్య కాపురానికి రాలేదని నిప్పంటించుకున్న భర్త....

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గుత్తి వంకాయ కూర ఆరోగ్య ప్రయోజనాలు

అనారోగ్య సమస్యలతో బాధపడుతూ కొబ్బరి నీళ్లు తాగుతున్నారా?

Goat Milk: మహిళలకు మేకపాలు ఎలా మేలు చేస్తుందో తెలుసా?

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments