Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఉస్తాద్ భగత్ సింగ్: పవన్ కల్యాణ్ సరసన హీరోయిన్ ఎవరు?

Webdunia
బుధవారం, 14 డిశెంబరు 2022 (16:28 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, హరీష్ శంకర్ దర్శకత్వంలో కొత్త సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ అనే ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభం అయ్యాయి. 
 
ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేదానిపై ప్రస్తుతం చర్చ సాగుతోంది.  ముందుగా ఈ సినిమా కోసం పూజా హెగ్డేను ఎంచుకున్నారు. కానీ ఆమెకు డేట్స్ కుదరకపోవడంతో ఆమె స్థానంలో వేరొకరిని ఎంచుకునే పనిలో పడింది సినీ యూనిట్. 
 
పవన్-హరీష్ కలయికలో ఇప్పటిదాకా వచ్చింది ఒక్క సినిమానే అయినప్పటికీ.. 'గబ్బర్ సింగ్' సృష్టించిన ప్రభంజనం కారణంగా 'ఉస్తాద్ భగత్ సింగ్'పై అప్పుడే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో హరీష్ శంకర్ తో 'దువ్వాడ జగన్నాథం' చిత్రానికి పని చేసిన అయానంక బోస్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించనున్నారు.
 
ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి, ఎడిటర్ ఛోటా కె.ప్రసాద్ ఈ చిత్రానికి పని చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ నటించిన 'జల్సా', 'గబ్బర్ సింగ్', 'అత్తారింటికి దారేది' వంటి చిత్రాలకు బ్లాక్ బస్టర్ సంగీతం అందించిన దేవి శ్రీ ప్రసాద్ మరోసారి తన మ్యూజిక్ తో మ్యాజిక్ చేయనున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విశాఖ ఉక్కు పరిశ్రమకు రూ.11,440 కోట్ల ప్యాకేజీ : కేంద్రం ప్రకటన

'గేమ్ ఛేంజర్' పైరసీ సినిమాను టెలికాస్ట్ చేసిన లోకల్ టీవీ ఓనర్ అరెస్టు!!

జనసేన-తెదేపా మధ్య చిచ్చు పెట్టిన కోడిపందేలు, ఏం జరుగుతోంది?

అవినీతి కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు 14 యేళ్ల జైలు

స్పేస్ వాక్ కోసం ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చిన సునీత విలియమ్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

HMPV వ్యాధి నిరోధించేందుకు చిట్కాలు

శిశువు గుండె భాగంలోకి వెళ్లిపోయిన లివర్, కిడ్నీలు, పేగులు: ప్రాణాల‌ను కాపాడిన లిటిల్ స్టార్- షీ ఉమెన్- చిల్డ్రన్ హాస్పిటల్‌

కిడ్నీలను డ్యామేజ్ చేసే అలవాట్లు, ఏంటవి?

పచ్చి బఠానీలు తింటే కలిగే ప్రయోజనాలు

సర్వరోగ నివారిణి తులసి రసం తాగితే?

తర్వాతి కథనం
Show comments