Webdunia - Bharat's app for daily news and videos

Install App

అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే...

అల్లు అర్జున్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాథం' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంది.

Webdunia
మంగళవారం, 13 సెప్టెంబరు 2016 (09:16 IST)
అల్లు అర్జున్ కథానాయకుడిగా హరీష్ శంకర్ దర్శకత్వంలో 'దువ్వాడ జగన్నాథం' చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుంది. కాగా సినిమా రెగ్యులర్ షూటింగుకి దర్శకనిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా కాజల్‌ను తీసుకోనున్నట్టు వార్తలు వెలువడ్డాయి. ఆమె పారితోషికం భారీ స్థాయిలో డిమాండ్ చేయడంతో, మెహ్రీన్‌ను సంప్రదిస్తున్నారనే టాక్ వినిపిస్తుంది. 
 
అయితే తాజా సమాచారం ప్రకారం... బన్నీ సరసన నటించేందుకు కన్నడ భామ పూజాహెగ్డే‌ను తీసుకోవాలనుకుంటున్నట్లు తెలుస్తోంది. గతంలో పూజా నటించిన ''ముకుంద'', ''ఒక లైలా కోసం'' సినిమాలు ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికి తెలిసిందే. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ సినిమా కోసం ఆమెను అడిగినట్లు, అందుకు ఆమె ఒప్పుకున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. 
 
దాదాపుగా ఆమెనే ఖాయం చేయవచ్చని సినీనిపుణులు అంటున్నారు.. పూజా హెగ్డే హిందీలో చేసిన 'మొహంజోదారో' సినిమా డిజాస్టర్ కావడంతో... ఆమె టాలీవుడ్‌పై దృష్టి పెట్టింది. ఈ కారణంగానే ఆమె ఈ సినిమా చేయడానికి వెంటనే ఒప్పుకుందని సమాచారం. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

IMD: ఏపీలో మే 10 నుండి 14 వరకు వర్షాలు.. రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో..?

Z+ Security: జెడ్ ప్లస్ భద్రత ఇవ్వండి లేదా బుల్లెట్ ఫ్రూఫ్ కారునైనా వాడుకుంటా!

Hyderabad Woman Doctor: రూ.5 లక్షల విలువైన కొకైన్ కోసం ఆర్డర్ చేసిన వైద్యురాలు

Vidadala Rajini: విడదల రజినికి మరో ఎదురుదెబ్బ- అనుచరుడు శ్రీకాంత్ రెడ్డి అరెస్ట్ (video)

My Sindoor to Border: పెళ్లైన మూడు రోజులే. నా సింధూరాన్ని సరిహద్దులకు పంపుతున్నా..

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆస్తమా రోగులు తినకూడని పదార్థాలు, ఏంటవి?

మండు వేసవిలో ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా?

రాగి బూరెలు తినండి, ఎందుకంటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments