Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేహమే ఆలయమంటున్న నటి... గ్లామరస్‌గా కనిపిస్తే తప్పేంటి!

Webdunia
ఆదివారం, 25 ఆగస్టు 2019 (10:59 IST)
దేహమే ఓ ఆలయం అంటోంది బాలీవుడ్ నటి పూజా హెగ్డే. అందువల్ల సినిమాల్లో గ్లామరస్‌గా కనిపిస్తే తప్పేంటి అని ఎదురు ప్రశ్నిస్తోంది. అసలు విషయానికి వస్తే, మిస్‌వరల్డ్‌ అందాల పోటీలో పాల్గొని మూడో స్థానానికి పరిమితం అయిన ఈ బ్యూటీ ఆ తర్వాత మోడలింగ్‌ రంగంలోకి ప్రవేశించి, ఆపై సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
 
అనంతరం మిస్కిన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన 'ముగమూడి' చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైంది. ఆ చిత్రం నిరాశపరచడంతో పూజాహెగ్డేను తమిళసినిమా మరచిపోయింది. దీంతో ఆ ఒక్క చిత్రంతోనే పూజాహెగ్డే తట్టాబుట్టా సర్దుకుంది. ఆ తర్వాత టాలీవుడ్‌లో ఎంట్రీ స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అల్లు అర్జున్, మహేశ్‌బాబు వంటి స్టార్లతో జతకట్టి హిట్స్‌ను తన ఖాతా లో వేసుకుంది. 
 
'రంగస్థలం' చిత్రంలో ఐటమ్‌ సాంగ్‌లో ఆడి దుమ్మురేపింది కూడా. అలాంటిది అక్కడ కూడా మార్కెట్‌ కాస్త తగ్గింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో రెండు చిత్రాలు చేతిలో ఉన్నాయి. అవీ స్టార్‌ హీరోలతో నటిస్తున్నవి కావు. ఇక హిందీలో "హౌస్‌పుల్‌ 4"లో నటిస్తోంది. దీంతో మరిన్ని అవకాశాల కోసం గాలం వేసేపనిలో పడింది.
 
ముఖ్యంగా కోలీవుడ్‌లో పాగా వేయాలన్న ఆశ మాత్రం పోలేదట. అందులో భాగంగానే అందరి హీరోయిన్ల మాదిరి గానే అందాలు ఆరబోస్తూ ప్రత్యేకంగా ఫొటో సెషన్‌ను ఏర్పాటు చేసుకుని, ఆ ఫొటోలను సామాజిక మాధ్యమాలకు విడుదల చేసింది. ఆ ఫొటోలపై నెటజిన్లే కాదు, సినీ అభిమానులు కామెట్స్‌ చేస్తున్నారు. కొందరైతే తీవ్రంగా విమర్శి స్తున్నారు.
 
దీంతో అలాంటి వారికి బదులిచ్చే విధంగా నటి  పూజాహెగ్డే దేహమే ఆలయం అని మన పెద్దలు అన్నారని, అదే విధంగా తన దేహాన్ని తాను ఆరాధిస్తానని చెప్పింది. అంతే కాకుండా అందాలను ప్రదర్శిస్తున్నాను.. ఇందులో తప్పేముంది? మీరు అంతగా ఇదైపోవాల్సిందేముంది?అని ఎదురు ప్రశ్న వేసింది. ఈ అమ్మడు సమాధానంతో ఏ ఒక్క నెటిజన్ నోరు మెదపడం లేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చంద్రబాబు కుంటే జగన్ ఆస్తులు తక్కువా?

Miss World Pageant: మే 7 నుండి 24 రోజుల పాటు హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు.. ఖర్చు రూ.54కోట్లు

ఏపీ ప్రజలకు చల్లటి కబురు చెప్పిన వాతావరణ శాఖ!!

Marri Rajasekhar: జగన్ ద్రోహం చేశారు.. ఆయనది నమ్మదగని నాయకత్వ శైలి.. టీడీపీలో చేరుతా

ఆ మహిళ పండించిన మామిడి పండు ధర రూ.10 వేలు!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

కివీ పండు స్త్రీలు తింటే ఫలితాలు ఏమిటి?

హైదరాబాద్‌లో యువత ప్రమాదంలో ఉంది: స్ట్రోక్ కేసుల పెరుగుదల ముందస్తు జోక్యం కోసం అత్యవసర పిలుపు

తర్వాతి కథనం
Show comments