ఇటీవలికాలంలో హీరోయిన్లే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఇప్పటికే సమంత, కీర్తి సురేష్, అనుపమా పరమేశ్వరన్ వంటివారు సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్నారు. ఈ కోవలో పంజాబీ భామ పూజా హెగ్డే కూడా చేరిపోయింది. ఈ నేపథ్యంలో పూజా హెగ్డే నటిస్తున్న తాజా చిత్రం "అరవింద సమేత వీరరాఘవ". ఈ చిత్రంలో జూనియర్ ఎన్టీఆర్ హీరో కాగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు.
'కృష్ణగాడి వీర ప్రేమగాథ' చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన నటి మెహ్రీన్. ఇప్పటివరకు ఏడు సినిమాలు చేసిన ఒక్క చిత్రానికి కూడా డబ్బింగ్ చెప్పుకోలేకపోయింది. మెహ్రీన్ స్వతహాగా పంజాబీ అమ్మాయికావడం వల్ల తెలుగు నేర్చుకోవడం ఆమెకు కష్టమే అయినా కూడా ఎట్టకేలకు తన గొంతును వినిపించడానికి సిద్దమవుతోంది.
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాంబినేషన్‌లో అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న 'ఎఫ్2' అనే చిత్రంలో వరుణ్‌కు జోడిగా నటిస్తోంది. ఈ సినిమాలో తన పాత్రకు స్వంతంగా డబ్బింగ్ చెప్పాలని ఉందని ఈ హీరోయిన్ చెబుతోంది. దీనికి చిత్ర నిర్మాత 'దిల్' రాజు, దర్శకుడు అనిల్ కూడా సమ్మతించినట్టు సమాచారం.