డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Webdunia
బుధవారం, 20 సెప్టెంబరు 2023 (18:59 IST)
హైదరాబాద్ నగరంలో వెలుగు చూసిన డ్రగ్స్ కేసులో హీరో నవదీప్‌కు తెలంగాణ హైకోర్టు షాకిచ్చింది. ఈ కేసులో తనను అరెస్టు చేయకుండా చూడాలంటూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... ఈ కేసులో విచారణకు సహకరించాల్సిందేనంటూ నవదీప్‌ను ఆదేశించింది. 
 
దీంతో నవదీప్‌కు 41ఏ సీఆర్పీ కింద పోలీసులు నేడో రేపో నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆయన విచారణకు హాజరుకాకుంటే తదుపరి చర్యలు తీసుకోనున్నారు. నవదీప్‌తో పాటు మరికొందరికి నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. 
 
కాగా, ఈ డ్రగ్స్ దందా కేసులో నవదీప్ పేరు కూడా వినిపించింది. దీంతో ఆయన అరెస్టు కాకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా, అక్కడ ఎదురుదెబ్బ తగిలింది. పైగా, ఈ కేసు విచారణకు సహకరించాల్సిందేనంటూ హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. 41కే కింద పోలీసులు నోటీసులు ఇచ్చి విచారణ జరపాలని పోలీసులకు సూచించింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మీరు కూడా దేవుళ్లే అంటూ చెప్పిన సత్యసాయి జయంతి ఉత్సవాలకు ప్రధానమంత్రి మోడి

హిడ్మా తల్లితో భోజనం చేసిన ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి.. వారం రోజుల్లో హిడ్మా హతం

బెట్టింగ్స్ యాప్స్ యాడ్స్ ప్రమోషన్ - 4 ఖాతాల్లో రూ.20 కోట్లు ... ఇమ్మడి రవి నేపథ్యమిదీ...

అమెరికా 15 సంవత్సరాలు టెక్కీగా పనిచేశాడు.. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు..

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా హతం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments