Webdunia - Bharat's app for daily news and videos

Install App

బుల్లితెరపై హీరో.. నిజ జీవితంలో జీరో.. భార్యను గెంటేశాడు..

Webdunia
సోమవారం, 3 మే 2021 (15:50 IST)
Rajesh
సినిమాల్లో చాలామంది తెరపై హీరోలుగా వుంటారు. విలన్లు కూడా నిజ జీవితంలో హీరోలుగా అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతుంటారు. ఇందులో బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఒకరు.

అయితే ఇక్కడ బుల్లి తెరమీద హీరోలా అమాయకంగా కనిపించే వ్యక్తి నిజజీవితంలో విలన్‌గా మారి తన భార్యకు నరకం చూపిస్తున్నాడు. భార్య ఉండగానే పరాయి స్త్రీలతో సంబంధాలు పెట్టుకుని తాళి కట్టిన భార్యను హింసిస్తున్నాడని అతడి భార్య అరుణ అలియాస్ సాధన పోలీసులను ఆశ్రయించింది.
 
వివరాల్లోకి వెళితే.. వదినమ్మ, చంద్రలేఖ వంటి సీరియల్స్‌లో హీరోగా నటిస్తున్న రాజేష్‌ దత్తా ….భార్య ఉండగానే వేరే అమ్మాయిలకు … పెళ్లి కాలేదని అబద్దాలు చెప్పి వారితో ఎపైర్స్ పెట్టుకున్నాడని అరుణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కోంది. ఇదేంటని ప్రశ్నిస్తే తనను ఇంట్లోంచి గెంటేశాడని ఆవేదన వ్యక్తం చేస్తోంది.
 
ఈ విషయంపై గట్టిగా నిలదీస్తే.. అంతా నా ఇష్టం. నేను ఎవరితోనైనా తిరుగుతాను, నీ ఇష్టమొచ్చింది చేసుకోపో అంటూ రాజేష్‌ తెగేసి చెప్పేవాడని, అంతేకాకుండా ఆ అమ్మాయిలను డైరెక్ట్‌గా ఇంటికే తీసుకొచ్చేవాడని వాపోయింది. అమ్మాయిలతో ఎఫైర్‌లపై నిలదీయడంతో భార్యను కట్టుబట్టలతో బయటకు గెంటేశాడు.
 
దీంతో ఆమె తల్లితండ్రులతో కలిసి జగద్గిరి గుట్ట పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. మరో వైపు రాజేష్ ఇంటివద్ద బైఠాయించి తనకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. నటుడు రాజేష్‌.. కర్తవ్యం, సుందరకాండ, మొగలిరేకులు, చక్రవాకం, రాధాకళ్యాణం, యువ, తూర్పు వెళ్లే రైలు సహా దాదాపు 28 సీరియల్స్‌లో నటించారు

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

పవన్‌ను కలిసిన రెన్షి రాజా.. ఎవరీయన?

అంతర్జాతీయ పులుల దినోత్సవం: భారతదేశంలో అగ్రస్థానంలో మధ్యప్రదేశ్‌

మహిళ లో దుస్తుల్లో రెండు తాబేళ్లు.. అలా కనుగొన్నారు..?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments