Webdunia - Bharat's app for daily news and videos

Install App

శ్రీరెడ్డిని వ్యభిచారం కేసులో అరెస్టు చేయాలి... డబ్బులివ్వాలంటూ డిమాండ్

నటి శ్రీరెడ్డి వ్యభిచారం చేస్తున్నట్టు అంగీకరించిందని అందువల్ల ఆమెను వ్యభిచారం కేసులో అరెస్టు చేయాలంటూ తమిళ నటుడు వారాహి చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్యాస్టింగ్ కౌచ్ అంశంతో ఒక్కసారి వెలుగులో

Webdunia
మంగళవారం, 24 జులై 2018 (09:48 IST)
నటి శ్రీరెడ్డి వ్యభిచారం చేస్తున్నట్టు అంగీకరించిందని అందువల్ల ఆమెను వ్యభిచారం కేసులో అరెస్టు చేయాలంటూ తమిళ నటుడు వారాహి చెన్నై నగర పోలీసులకు ఫిర్యాదు చేశాడు. క్యాస్టింగ్ కౌచ్ అంశంతో ఒక్కసారి వెలుగులోకి వచ్చిన నటి శ్రీరెడ్డి. పలువురు టాలీవుడ్ నటీనటులపై సంచలన ఆరోపణలు చేసిన శ్రీరెడ్డి.. ఇపుడు కోలీవుడ్‌పై దృష్టిసారించింది. కాస్టింగ్‌ కౌచ్‌ అంటూ ప్రముఖ దర్శకుడు ఏఆర్‌.మురుగదాస్, సుందర్‌.సి నుంచి నటుడు రాఘవ లారెన్స్, శ్రీకాంత్‌(తెలుగులో శ్రీరామ్‌) వరకూ ఆరోపణలు చేసి సంచలనం సృష్టిస్తోంది.
 
ఇప్పటికే నడిగర్‌ సంఘం కార్యదర్శి విశాల్, కోశాధికారి కార్తీ తీవ్ర చర్యలుంటాయని హెచ్చరించినా శ్రీరెడ్డి వాటిని కేర్‌ చేయకుండా చెన్నైలో మకాం పెట్టి కలకలం సృష్టిస్తోంది. దీంతో నటుడు వారాహి సోమవారం చెన్నై పోలీస్‌ కమిషనర్‌ కార్యాలయంలో శ్రీరెడ్డిపై ఫిర్యాదు చేశారు. 
 
ఇందులో నటి శ్రీరెడ్డి టాలీవుడ్‌లోని ప్రముఖులపై కాస్టింగ్‌ కౌచ్‌ ఆరోపణలు, బెదిరింపులతో డబ్బు వసూలుచేసిందన్నారు. ఇప్పుడు కోలీవుడ్‌లో బెదిరింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. శ్రీరెడ్డి ఇటీవల ఒక భేటీలో అత్యాచార వేధింపులకు ఆధారాలున్నాయా? అన్న ప్రశ్నకు మహిళలను కించపరచేలా బదులిచ్చిందన్నారు. ఆమె వ్యభిచారాన్ని అంగీకరించినట్లు పేర్కొందన్నారు. శ్రీరెడ్డిని వ్యభిచార కేసులో అరెస్ట్‌ చేయాలని ఫిర్యాదులో కోరారు.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments