Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్‌ఎక్స్ 100 భామపై కేసు.. ఎందుకు?

Webdunia
శనివారం, 21 ఆగస్టు 2021 (10:32 IST)
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో బాగా గుర్తింపు తెచ్చుకున్న పాయల్ రాజ్ పుత్‌పై కేసు నమోదైంది. ఇక తను నటించిన మొదటి సినిమాతోనే.. సక్సెస్ సాధించుకుంది ఈమె. అయితే సినిమాలో ఎంతో హాట్గా కనిపించిన ఈ భామ. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో కూడా నటించిన ఆశించిన ఫలితాలు లభించలేదు. అయితే ఈమె పై ప్రస్తుతం ఒక కేసు ఫైల్ అయినట్లు తెలుస్తోంది. ఆ విషయాలను చూద్దాం.
 
గత నెల 11న పెద్దపల్లి పట్టణంలో ఒక షాపింగ్ మాల్ ను చేసేందుకు.. పాయల్ అక్కడికి వెళ్ళింది.అయితే అదే కార్యక్రమంలో పాల్గొన్న ఈమె మాస్కు పెట్టుకోకుండా వచ్చింది. ప్రభుత్వం విధించిన ఆంక్షలను..పాటించకపోవడంతో ఈమె పై పెద్దపల్లికి చెందిన బొంకూరి సంతోష్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆ హీరోయిన్ పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజేష్ తెలిపారు. మరి ఈ కేసుపై ఈమె ఎలా స్పందిస్తుందో అనే విషయం పై వేచి చూడాలి.
 
ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ భామ ఇలాంటి కేసులలో చిక్కు కోవడం వల్ల ఈమెపై ప్రేక్షకులు మండి పడుతున్నారు. ప్రజలకి చెప్పాల్సింది మీరే కాకుండా ఇలాంటివి చేస్తే ఎలా అని కొంత మంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
 
ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ ఆది సరసన ఒక సినిమాలో నటిస్తున్నది. అంతేకాకుండా ఆది తోనే మరొక సినిమాను కూడా త్వరలో చేయబోతున్నట్లు వారి ప్రకటించారు. ఇక ఈమె పై పెట్టిన కేసుతో కొంతమంది హీరోయిన్లు అలర్ట్ అయినట్లు సినీ ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఎక్కడికైనా ఓపెనింగ్స్ కి వెళ్ళిన, ఫంక్షన్లకు వెళ్లిన ఖచ్చితంగా మస్క్ పెట్టుకుని వెళ్లాలని కొంత మంది సినీ ప్రముఖులు నిర్ణయించుకున్నారట. ఇదే విషయం వారి మీద రిపీట్ కాకుండా ఉండేందుకు ఆలోచిస్తున్నారు సినీ ప్రముఖులు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భార్యాభర్తల గొడవ ... ఇద్దరి ప్రాణం తీసింది..

ఉద్యోగాలు, ప్రతిభ పరంగా అసాధారణ రీతిలో వృద్ధి చెందుతున్న 10 నగరాల్లో విశాఖపట్నం నెం. 1, విజయవాడ నెం. 3

నేను వైసిపి నాయకుడినే కానీ నాకు బాలయ్య దేవుడు: వైసిపి నాయకుడు సిద్దారెడ్డి

బెంగుళూరు విద్యార్థినికి లైంగిక వేధింపులు... ఇద్దరు ప్రొఫెసర్లతో సహా ముగ్గురి అరెస్టు

కాలేజీ విద్యార్థిని కాలును కరిచి కండ పీకిని వీధి కుక్కలు (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

డయాబెటిస్ వ్యాధిగ్రస్తులు తాగేందుకు అనువైన టీ, ఏంటది?

శ్వాసనాళ సంబంధ వ్యాధులకు కారణమయ్యే రెస్పిరేటరీ సింశైషియల్ వైరస్‌పై అవగాహన, టీకాల అవసరం

తర్వాతి కథనం
Show comments