Webdunia - Bharat's app for daily news and videos

Install App

పెళ్ళికి తర్వాత ఎందుకిలే.. ఇప్పుడే ఫోటోషూట్ చేసేస్తే పోలా.. సమంత ఫోటోలు అదుర్స్

చెన్నైలో పుట్టిన సమంత రూత్ ప్రభు టాలీవుడ్ హీరోయిన్. టీనెజీలోనే మోడలింగ్ కెరీర్‌ను మొదలెట్టింది. చెన్నైలోని పల్లావరంలోని సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూలు, చెన్నైలోని హోలీ ఏంజెల్స్ సెకండరీ స్కూ

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2016 (18:06 IST)
చెన్నైలో పుట్టిన సమంత రూత్ ప్రభు టాలీవుడ్ హీరోయిన్. టీనెజీలోనే మోడలింగ్ కెరీర్‌ను మొదలెట్టింది. చెన్నైలోని పల్లావరంలోని సెయింట్ స్టీఫెన్స్ మెట్రిక్యులేషన్ స్కూలు, చెన్నైలోని హోలీ ఏంజెల్స్ సెకండరీ స్కూళ్ళలో సమంత విద్యాభ్యాసం కొనసాగింది. చెన్నైలోని స్టెల్లా మేరీ కాలేజీనుండి బీకాం పట్టా అందుకుంది. గౌతమ్ మీనన్ దర్శకత్వంలో 2010 లో విడుదలైన 'ఏ మాయ చేసావే' ద్వారా సమంత సినిమా కెరీర్ మొదలయ్యింది. 
 
తొలి సినిమా ద్వారానే 2010లో ఫిల్మ్ ఫేర్ అవార్డు, 2012లో నందీ అవార్డు అందుకుంది. ప్రసిద్ధ దక్షిణాది నటి రేవతి తర్వాత ఫిల్మ్ ఫేర్ మరియూ నందీ అవార్డు అందుకున్నది సమంతనే. ఇలా దక్షిణాది హీరోయిన్లలో టాప్ తారగా వెలుగొందిన సమంత అగ్ర హీరోలు, కుర్ర హీరోలతో నటించింది. త్వరలో అక్కినేని ఇంటి కోడలు కానున్న సమంత మళ్లీ వార్తల్లోకెక్కింది. 
 
సరైనా సినిమాలు లేకపోవడంతో నటించడంలేదంటూ ఆ మధ్య మనసులోని మాట బయటపెట్టింది సమంత. ప్రస్తుతం సౌత్ స్కోప్ మేగజైన్‌కి కత్తిలాంటి ఫోటోషూట్ ఇచ్చేసింది ఈ అమ్మడు. ఇందులో సామ్ క్యూట్‌గా కనిపించింది. డిఫరెంట్ ఫోజులతో కుర్రకారును ఆకట్టుకునేలా డ్రెస్ కోడ్ వేసింది. మ్యారేజ్ తర్వాత లేనిపోని ఆంక్షల వల్ల ఇలా ఫోటో షూట్ ఇవ్వడం కుదరదనుకుందో ఏమో కానీ.. సమంత మ్యాగజైన్ కోసం గ్లామర్‌గా కనబడింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

శివశక్తి పాయింట్ వయసు 370 కోట్ల సంవత్సరాలా?

ఉపాధ్యాయురాలి తలపై నుంచి వెళ్లిన లారీ...

వైకాపా మాజీ మంత్రికి అరెస్టు భయం... ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్

తెలంగాణలో మందుబాబులకు బిగ్ షాక్: బీర్ల ధరలు పెంపు

పార్లమెంటులో ప్రధానమంత్రి మోదీ తినేందుకు రూ. 50 భోజనం, అంతేనా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కామెర్లు వచ్చినవారు ఏం తినాలి? ఏం తినకూడదు?

మీ శరీరంలో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయా? అయితే, గుండెపోటు వస్తుంది.. జర జాగ్రత్త!!

గుండెపోటు వచ్చే ముందు 8 సంకేతాలు, ఏంటవి?

జలుబును నివారించి రోగనిరోధక శక్తిని పెంచే సూప్‌లు

ఏ వేలు నొక్కితే రక్తపోటు తగ్గుతుంది?

తర్వాతి కథనం
Show comments