Webdunia - Bharat's app for daily news and videos

Install App

17న 'పిచ్చిగా నచ్చావ్‌'... కథ కోసం హీరోయిన్ క్రియేట్ అవుతుంది..

సంజీవ్ చేతన ఉత్తేజ్‌, నందు, కారుణ్య నటీనటులుగా శ్రీవత్స క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'పిచ్చిగా నచ్చావ్‌'. వి.శశిభూషణ్‌ దర్శకుడు. కమల్‌కుమార్‌ పెండెం నిర్మాత. ఈ సినిమా మార్చి 17న విడుల‌వుతు

Webdunia
బుధవారం, 15 మార్చి 2017 (18:37 IST)
సంజీవ్ చేతన ఉత్తేజ్‌, నందు, కారుణ్య నటీనటులుగా శ్రీవత్స క్రియేషన్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'పిచ్చిగా నచ్చావ్‌'. వి.శశిభూషణ్‌ దర్శకుడు. కమల్‌కుమార్‌ పెండెం నిర్మాత. ఈ సినిమా మార్చి 17న విడుల‌వుతుంది. 
 
ఈ సంద‌ర్భంగా బుధ‌వారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల స‌మావేశంలో... నిర్మాత క‌మల్‌కుమార్ పెండెం మాట్లాడుతూ- `ఈ సినిమా కోసం ఒక సంవ‌త్స‌రంగా టీం అంద‌రూ క‌ల‌సి ఒక ఫ్యామిలీలా ట్రావెల్ అవుతున్నాం. ఎక్క‌డా ఇబ్బందులు లేకుండా సినిమాను అనుకున‌్న స‌మ‌యంలో పూర్తి చేశాం. మంచి మ్యూజిక్‌, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాను నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్ళాయి. సినిమా అంద‌రికీ న‌చ్చేలా ఉంటుంది" అన్నారు.
 
ద‌ర్శ‌కుడు వి.శ‌శిభూష‌ణ్ మాట్లాడుతూ -"క‌థ విన‌గానే నిర్మాత క‌మ‌ల్‌గారు సినిమాను నిర్మించ‌డానికి ముందుకు వ‌చ్చారు. సినిమాను కృష్ణాజిల్లాలో 46 రోజులు పాటు ఏక‌ధాటిగా చిత్రీక‌రించాం. మంచి ఎమోష‌న‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌. దాదాపు కొత్త‌వాళ్ళ‌తో చేసిన సినిమా. క‌థ‌లో హీరోయిన్ ఉండ‌దు. క‌థ వ‌ల్ల హీరోయిన్ క్రియేట్ అవుతుంది. ఒక‌రిని న‌మ్మితే వారి కోసం ఎంత దూరం అయినా వెళ‌తాం. 108 థియేట‌ర్స్‌లో సినిమాను రిలీజ్ చేస్తున్నాం. అచ్చ తెలుగు స్వ‌చ్చ‌మైన ప్రేమ‌క‌థ‌. మార్చి 17న సినిమా రిలీజ్ అవుతుంది" అన్నారు.
 
పుచ్చా రామ‌కృష్ణ మాట్లాడుతూ - ``నిర్మాత క‌మల్‌కుమార్‌గారు, ద‌ర్శ‌కుడు శ‌శిభూష‌ణ్, నేను ఈ సినిమా కోసం ముందు నుండి ట్రావెల్ చేస్తూ వ‌స్తున్నాం. దర్శ‌కుడు శ‌శిభూష‌ణ్ మ‌దిలో వ‌చ్చిన చ‌క్క‌ని ఆలోచ‌నే `పిచ్చిగా న‌చ్చావ్‌`. నిర్మాత క‌మ‌ల్‌గారు సినిమాను ఎక్క‌గా కాంప్ర‌మైజ్ కాకుండా నిర్మించారు. సినిమా చూసిన వారంద‌రూ దీన్ని భారీ బ‌డ్జెట్ మూవీ అనుకుంటున్నారు. సినిమా చూసి సురేష్ ప్రొడ‌క్‌వన్ వంటి సంస్థ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేస్తానని చెప్ప‌డం ఆనందంగా ఉంది. మార్చి 17న సినిమా తెలుగు రాష్ట్రాల్లో విడుద‌ల అవుతుంది. మా ప్ర‌య‌త్నాన్ని అంద‌రూ ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

acidity కడుపులో మంట తగ్గటానికి ఈ చిట్కాలు

ఆ సమస్యలకు వెల్లుల్లి వైద్యం, ఏం చేయాలంటే?

బాదంపప్పును ఎండబెట్టినవి లేదా నానబెట్టివి తినాలా?

ఎన్నికల సీజన్‌లో కొన్ని బాదంపప్పులతో చురుకుగా, శక్తివంతంగా ఉండండి

స్ట్రాబెర్రీస్ తింటున్నారా... ఐతే ఇవి తెలుసుకోండి

తర్వాతి కథనం
Show comments