Webdunia - Bharat's app for daily news and videos

Install App

బిగ్ బాస్‌ షోకు చుక్కలు.. షోను వెంటనే ఆపివేయాలంటూ..

Webdunia
శుక్రవారం, 30 సెప్టెంబరు 2022 (22:17 IST)
బిగ్ బాస్ మూడో వారం వచ్చేసరికి వీక్షకుల సంఖ్య కూడా పెరిగింది. ఇక కంటెస్టెంట్స్‌కు ఓట్లు కూడా పెరుగుతున్నాయి. ఇందులో రేవంత్ అయితే టాప్ లిస్టులో కొనసాగుతున్నాడు. 
 
అతనికి గతవారం ఓట్ల సంఖ్య తగ్గినప్పటికీ ఇప్పుడు మాత్రం టాస్క్‌లలో చాలా బలంగా పోరాడుతూ మళ్ళీ తన నెంబర్ వన్ ర్యాంకును సంపాదించుకున్నాడు. ఇప్పుడు అందరికంటే ఎక్కువగా అతనికి ఓట్లు పడుతున్నాయి. ఆ తర్వాత ఊహించని విధంగా రెండవ స్థానంలో కీర్తి ఉండడం విశేషం.
 
రేవంత్ తర్వాత ఎప్పుడూ కూడా అత్యధిక ఓట్లు అందుకుంటున్న వారిలో శ్రీహన్ అయితే రెండవ స్థానంలో ఉంటున్నాడు. కానీ ఈ వారం అతని రేంజ్ మూడవ స్థానానికి పరిమితం కావడం విశేషం. 
 
ఇక ఆఖరి స్థానంలో గత రెండు వారాలు కొనసాగిన ఇనయా సుల్తానా ఈ వారం ఒక్కసారిగా బౌన్స్ బ్యాక్ అయింది. దీంతో అత్యధిక ఓట్లు అందుకుంటున్న వారిలో ఆమె ఇప్పుడు నాలుగో స్థానంలో ఉంది.
 
ఇకపోతే.. తాజాగా ఏపీ హైకోర్టులో బిగ్ బాస్ షో ఆపేయాలంటూ పిటిషన్ దాఖలు అయ్యింది. బిగ్ బాస్ షోలో అశ్లీలత ఎక్కువయ్యిందంటూ.. అడ్వకేట్ శివప్రసాద్ రెడ్డి ఆరోపించారు. 
 
బిగ్ బాస్ షోను వెంటనే ఆపివేయాలంటూ.. ఏపీ హైకోర్టులో పిటీషన్ వేశారు అడ్వకేట్ శివప్రసాద్ రెడ్డి. ఐ.బి.ఎఫ్ గైడ్ లైన్స్ ప్రకారం సమయాన్ని పాటించాలన్న పిటిషనర్. రాత్రి 11 నుంచీ తెల్లవారుజామున 5 వరకూ మాత్రమే బిగ్ బాస్ షో నిలిపివేయాలన్నారు.
 
ఇక బిగ్ బాస్ రియాల్టీ గేమ్ షోలో అశ్లీలత ఎక్కువగా ఉందని కుటుంబంతో కలిసి చూసేలా లేదని ఆయన ఆరోపించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి కేసు : వల్లభనేని వంశీకి మళ్లీ నిరాశ

ఉద్యోగం కోసం కీచులాటల్లో భార్యను హత్య చేసాడా? భార్యాభర్తల కాల్ డేటా చూస్తున్నారా?

త్రిభాషా విద్యా విధానం వద్దు.. ద్విభాషే ముద్దు... వక్ఫ్ బిల్లు రద్దు చేయాలి : విజయ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments