Webdunia - Bharat's app for daily news and videos

Install App

నటనకు పెళ్ళికి లింకెందుకు.. హీరోయిన్లకు పెళ్లి సాకు అవసరమా?: కాజోల్ ప్రశ్న

హీరోయిన్లకు పెళ్ళి అనేది అడ్డు కాదంటోంది.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్. ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్‌లు పెళ్లైనా సినిమాలకు దూరం కాకుండా బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న నేపథ్యంలో... నటనకు పెళ

Webdunia
సోమవారం, 17 అక్టోబరు 2016 (14:29 IST)
హీరోయిన్లకు పెళ్ళి అనేది అడ్డు కాదంటోంది.. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్. ఐశ్వర్యరాయ్, కరీనా కపూర్‌లు పెళ్లైనా సినిమాలకు దూరం కాకుండా బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్లుగా రాణిస్తున్న నేపథ్యంలో... నటనకు పెళ్ళికి లింకు పెట్టకూడదని కజోల్ అంటోంది. అలనాటి నటులు షర్మిలా ఠాగూర్, తనుజా, సైరాభాను, డింపుల్ కపాడియా వంటి హీరోయిన్లు పెళ్లికి తర్వాతే నటించారు. 
 
నిజానికి పెళ్లికి తర్వాతే వాళ్లు ఎక్కువ సినిమాల్లో నటించారని.. వాళ్లెంతో మందికి ఆదర్శం అంటూ కాజోల్ చెప్పుకొచ్చింది. పెళ్లైన హీరోయిన్లు సినిమాల్లో కనిపించడం చాలా రోజులుగా కొనసాగుతోంది. పెళ్లైంది కదాని.. సినిమాల్లో ఎందుకు నటిస్తున్నావ్ అంటూ ఎవ్వరూ అడ్డుపడరని కజోల్ వెల్లడించింది.  
 
''అలాగే చాలామంది కథానాయికలు పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్నారు. వాళ్లు పెళ్లిని ఓ సాకుగా చూపి సినిమాలకు దూరంగా ఉంటున్నారు. నేను వాళ్లను తప్పుపట్టడం లేదు. సినిమాల్లో నటించడం.. నటించకపోవడం వాళ్ల ఇష్టం. కానీ ఇప్పటికీ అభిమానులు నన్ను ఆదరిస్తున్నారు. కాబట్టి నేను సినిమాలను విడిచిపెట్టను. పెళ్లి తర్వాత కూడా సినిమాల్లో నటించి పేరు తెచ్చుకున్న కథానాయిలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్తానని కజోల్ తెలిపింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

తమిళనాడు జీడీపీ కంటే పాకిస్థాన్ జీడీపీ తక్కువా? నెటిజన్ల సెటైర్లు!!

కాశ్మీర్ త్రాల్‌లో ముగ్గురు ఉగ్రవాదులు హతం, ఒకడు పహెల్గాం దాడిలో పాల్గొన్నాడు?!!

హత్యకు దారితీసిన సమోసా ఘర్షణ - షాపు యజమానిని కాల్చేసిన కస్టమర్!!

టీడీపీ మహానాడు.. నారా లోకేష్‌కు ప్రమోషన్ ఇచ్చే ఛాన్స్.. ఏ పదవి ఇస్తారంటే?

ఆపరేషన్ సిందూర్‌తో ఉగ్రవాదంపై ఉక్కుపాదం: శ్రీనగర్ లో రక్షణమంత్రి రాజ్‌నాథ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

పైల్స్ తగ్గేందుకు సింపుల్ టిప్స్

పసుపు, మిరియాల పొడిని కలిపిన గోల్డెన్ మిల్క్ తాగితే?

రోజూ ఒక చెంచా తేనె సేవిస్తే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments