Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రైనింగ్ ఫిల్మ్ అకాడమీ (PMFA) ప్రారంభించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

PMF traing school
డీవీ
గురువారం, 9 జనవరి 2025 (16:08 IST)
PMF traing school
గూడచారి, కార్తికేయ 2, వెంకీ మామ, ఓ బేబీ, డమాకా లాంటి బ్లాక్ బస్టర్స్ తో,  ప్రొడ్యూసర్ T.G. విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో రూపొందిన నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. ట్రైనింగ్ ఇవ్వడానికి బిజినెస్ చేసే ఈ కాలంలో, ఫిల్మ్ కోర్స్ లు ద్వారా నేటి యువతకి మేము ఉన్నామని భరోసా ఇస్తూ ఉచిత శిక్షణ కల్పించి టాలెంటెడ్ పీపుల్ ని పరిచయం చేయడమే PMFA ప్రధాన లక్ష్యం. భారత దేశంలో మొట్ట మొదటి సారిగా (on-job) ట్రైనింగ్ ఫిల్మ్ అకాడమీ (PMFA) హైదరాబాద్, బెంగళూరులో ప్రారంభించిన  పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఫౌండర్ & చైర్మన్ T.G. విశ్వప్రసాద్ గారికి ఈ ఘనత దక్కుతుంది.
 
చైర్ఉమెన్ T.G. వందన ప్రసాద్ అధ్వర్యంలో, PMFA ప్రపంచ స్థాయి ట్రైనింగ్ సౌకర్యం, భావితరాలకి మంచి భవిషత్తు అందించడానికి దిశా నిర్దేశగా అడుగులు వేస్తుంది. ప్రారంభించిన మొదటి రోజు నుంచే స్టూడెంట్స్ కు రియల్ ప్రాజెక్టులపై పని చేసే అవకాశం కల్పించడంతో పాటు, సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ కు ఫీజు చెల్లించాల్సిన అవసరం లేకుండా, ఈ ఫిల్మ్ కోర్సులు పూర్తిగా ఉచిత శిక్షణ ఇస్తుంది.
 
హైదరాబాద్, బెంగళూరు అందుబాటులో ఉన్న కోర్సులు: యాక్టింగ్, డైరెక్షన్, స్క్రిప్ట్ రైటింగ్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, ఆర్ట్, మేకప్, కాస్ట్యూమ్స్, డిజైయినింగ్, వర్చ్యువల్ ప్రొడక్షన్ & డిఐ, లైటింగ్. రాజాసాబ్, గూఢచారి 2, మీరాయ్, తెలుసు కదా, జాట్, పినాక మరియు ఆసక్తికరమైన మరెన్నో ప్రాజెక్టులు చేస్తూనే, PMF యొక్క ఫ్యాక్టరీ-మోడల్ సమర్థవంతమైన కంటెంట్ క్రియేషన్ మోడల్ ను అనుసరిస్తూ, వెబ్ సిరీస్, OTT మూవీస్, మ్యూజిక్ ఆల్బమ్స్, యూట్యూబ్ కంటెంట్, మరియు మల్టీ లింగ్యువల్ ప్రాజెక్టుల చేస్తుంది.  
 
ఇప్పటికే ఇంగ్లిష్, తెలుగు, కన్నడ, తమిళం, హిందీ, బెంగాలీ వంటి భాషల్లో ప్రాజెక్టులు పూర్తవ్వడంతో పాటు ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా సాగుతున్నాయి. త్వరలో మరిన్ని భాషల్లో విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. అప్లై చేయండి! ఫ్రీ ట్రైనింగ్ మరియు రియల్ ప్రాజెక్టులపై ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ చేసే అరుదైన అవకాశం పొందండి అంటూ పేర్కొంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

చీటింగ్ కేసులో లేడీ అఘోరీ అరెస్టు.. లింగ నిర్ధారణకు పోలీసుల నిర్ణయం!

ఉగ్రవాదులకు ఆశ్రయమా? సిగ్గుపడాలి.. పాక్ ప్రధానిని ఏకిపారేసిన మాజీ క్రికెటర్

మాజీ మంత్రి విడుదల రజిని మరిది గోపి అరెస్టు

పట్టువదలని విక్రమార్కుడు తెలుగు కుర్రోడు సాయి చైతన్య : సివిల్స్‌లో 68వ ర్యాంకు

జమ్మూకాశ్మీర్‌లో హై అలెర్ట్ - మళ్లీ దాడులు జరిగే ఛాన్స్... నేడు ఆల్‌ పార్టీ మీటింగ్!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

సబ్జా గింజలు నీటిలో నానబెట్టి తాగితే...

ఈ పండ్లు తిన్న వెంటనే మంచినీరు తాగితే ఏమవుతుందో తెలుసా?

Ginger and Honey అల్లరసం, తేనె సమపాళ్ళలో కలుపుకొని సేవిస్తే?

చేపలు కూర తినేవాళ్లకు ఇవన్నీ...

ఐపిఎల్ సీజన్‌ వేళ, బలం- శక్తి కోసం కాలిఫోర్నియా బాదం పప్పును తినండి

తర్వాతి కథనం
Show comments