Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను ఏడిస్తే జనాలు సినిమాలు చూడరుః సాయి పల్లవి

Webdunia
గురువారం, 23 డిశెంబరు 2021 (19:25 IST)
Saipallavi
సాయి పల్లవి వుందంటే హీరోను ఏడిపిస్తేచాలు హిట్‌. ఫిదా, ల‌వ్‌స్టోరీ సినిమాలు అందుకు ఉదాహ‌ర‌ణలు. కానీ కొన్ని సార్లు ఏడిపిస్తుంటుంది. అలా చేస్తే జ‌నాలు చూడ‌ర‌ని తెలియ‌జేస్తుంది. శ్యామ్ సింగ‌రాయ్‌లో దేవ‌దాసిగా న‌టించింది. ఇందులో ర‌క‌ర‌కాల ఎమోష‌న్స్‌లో ఆమె న‌టించింది. 
 
ఆమె మాట్లాడుతూ.. ‘రిలీజ్‌కు ముందు చాలా భయంగా ఉంటుంది. ఫస్ట్ డే నుంచి నాని గారి నుంచి ధైర్యాన్ని తీసుకున్నాను. ఫస్ట్ నుంచి సోషల్ మీడియాలో పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. మీ అంచనాలు అందుకునేలా ఉంటుంది. ఈ సినిమాను అందరూ థియేటర్లో చూడండి. నాకు ఎలాంటి రోల్ చేస్తే సంతోషమనిపిస్తే అదే చేస్తాను. ఆ పాత్రను నేను చేయగలనా? లేదా? అని ఆలోచిస్తాను. నేను సినిమాను చూస్తే నాకు నచ్చుతుందా? లేదా? అనే కోణంలోంచి పాత్రలను ఎంచుకుంటాను. శ్యామ్ సింగ రాయ్‌లో నాకే నచ్చిన పాత్రను చేస్తున్నాను. నేను డ్యాన్స్ చేయగలను అని డ్యాన్స్ మూమెంట్స్ పెట్టమని నేను అడగను. పాత్రకు ఎంత కావాలో అంతే చేస్తాం. దేవదాసీలు అంటే ఇలా ఉంటారా? అని అనుకున్నాను. కానీ దర్శకుడు మాత్రం ఓ పాత్రను డిజైన్ చేస్తారు. ఈ పాత్రను చేయడంతో నటిగా ఇంకా ఎదిగానని అనిపిస్తుంది. మేం కామ్రేడ్‌లాంటి వాళ్లం. ఇద్దరికీ నటన అంటే పిచ్చి. మేం ఎప్పుడూ దర్శకులను ప్రశ్నలతో ఇబ్బంది పెడుతుంటాం. నేను ఏడిస్తే జనాలు సినిమాలు చూడరు. నవ్వితేనే చూస్తారు అని అనుకోను. నాకు నచ్చిన పాత్రలు చేస్తూ వెళ్తాను’ అని అన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పాకిస్థాన్ సైన్యంలో తిరుగుబాటు : ఆర్మీ చీఫ్‌కి జూనియర్ల వార్నింగ్

తిరుపతిలో వ్యర్థాలను ఏరుకునే వారి కోసం ట్రాన్స్‌ఫర్మేటివ్ ప్రాజెక్ట్

Praveen Kumar: పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మరణానికి ఏంటి కారణం?

Bhadrachalam: భద్రాచలంలో ఆరు అంతస్థుల భవనం కుప్పకూలింది: శిథిలాల కింద ఎంతమంది? (video)

పాస్‌పోర్ట్ మరిచిపోయిన పైలెట్... 2 గంటల జర్నీ తర్వాత విమానం వెనక్కి!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లోబీపి లక్షణాలు, సమస్యలు ఏంటి?

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

ఆలివ్ ఆయిల్ ప్రయోజనాలు

రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి మీ ఆహారంలో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments