Webdunia - Bharat's app for daily news and videos

Install App

కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నా... పాయల్ రాజ్‌పుత్

Webdunia
ఆదివారం, 22 అక్టోబరు 2023 (13:57 IST)
తాను కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నానని హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ చెప్పారు. తన కెరీర్ ఎటు వెళుతుందో తెలియని అయోమయ పరిస్థితుల్లో తనకు "మంగళవారం" సినిమా అవకాశం వచ్చిందని ఆమె చెప్పారు. అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం "మంగళవారం". మూవీ ట్రైలర్‌ను తాజాగా రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లాంచ్ వేడుకలు హీరోయిన్ పాయల్ రాజ్‌పుత్ పాల్గొని, తన ఆరోగ్య సమస్యలను బహిర్గతం చేశారు. తాను గత కొంతకాలంగా కిడ్నీ ఇన్ఫెక్షన్‌ సమస్యతో బాధపడుతున్నానని, వైద్యులు ఖచ్చితంగా ఆపరేషన్ కూడా చేయాలన్నారని చెప్పింది. 
 
'అజయ్ ఈ సినిమా కోసం నన్ను అప్రోచ్ అయ్యే సమయానికి నా ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో ఎవరికీ తెలీదు. అప్పుడు నేను కిడ్నీ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాను. వైద్యులు సర్జరీ చేయాల్సిందేనని ఖచ్చితంగా సూచించారు. అయితే, అజయ్ చెప్పిన కథ నాకెంతో నచ్చేసింది. ఈ సినిమా తప్పకుండా చేయాలని నిర్ణయించుకున్నా. సినిమా పూర్తి చేశాకే సర్జరీకి వెళ్తానని చెప్పాను' అని ఆమె తెలిపింది.
 
'ఇది నా జీవితంలో చాలా ముఖ్యమైన రోజు, ట్రైలర్ విడుదలైన కొన్ని క్షణాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. నా కెరీర్ ఎటు వెళుతోందో తెలియని అనిశ్చితి నెలకొన్న సమయంలో 'మంగళవారం' సినిమా వచ్చింది. ‘ఆర్ఎక్స్ 100'తో అజయ్ భూపతి నన్ను లాంచ్ చేశారు. అది నా కెరీర్ను మార్చేసింది. ఇప్పుడు 'మంగళవారం'లో అవకాశం ఇచ్చి మరోసారి నన్ను లాంచ్ చేస్తున్నారు. ఆయనకు థ్యాంక్స్' అని పేర్కొన్నారు. కాగా, "ఆర్ఎక్స్ 100" చిత్రం తర్వాత పాయల్ రాజ్‌పుత్ ఖాతాలో సరైన హిట్ లేకపోవడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

టీడీపీ జెండాను పట్టుకున్న నందమూరి హీరో కళ్యాణ్ రామ్.. మా మధ్య అవి లేవండి?

అన్నా ఒకసారి ముఖం చూస్కో.. ఎలా అయిపోయావో.. వంశీ అభిమానుల ఆందోళన (video)

అమరావతిలో చంద్రబాబు శాశ్వత ఇంటి నిర్మాణం ప్రారంభం.. ఎప్పుడు.. ఎక్కడ?

ఎస్బీఐ బ్యాంకు దొంగతనం- బావిలో 17 కిలోల బంగారం స్వాధీనం

మయన్మార్‌ భూకంపం.. 2,056కి పెరిగిన మృతుల సంఖ్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

తర్వాతి కథనం
Show comments