Webdunia - Bharat's app for daily news and videos

Install App

దూకుడు మీదున్న పవన్ కళ్యాణ్ - రెండు చిత్రాల అప్‌డేట్స్ వెల్లడి

Webdunia
గురువారం, 4 మే 2023 (12:07 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మంచి జోరుమీదున్నారు. తన చిత్రాలకు సంబంధించిన రెండు మూవీల అప్‌డేట్స్‌ను వెల్లడించారు. దీంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇప్పటికే కొన్ని సినిమాల షూటింగ్‌లు చివరి దశలో ఉండగా.. మరికొన్ని శరవేగంగా పూర్తవుతున్నాయి. ఇపుడు తన రెండు చిత్రాలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 
 
ఈ నేపథ్యంలో తొలుత #OG టీమ్‌ ట్వీట్‌ చేయగా.. వెంటనే 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌' నుంచి సర్‌ప్రైజ్‌ అప్‌డేట్‌ వచ్చింది. పవన్‌-సుజీత్‌ల కాంబోలో రానున్న సినిమా 'ఓజీ'. గ్యాంగ్‌స్టర్‌ డ్రామాగా తెరకెక్కిస్తున్నారు. తాజాగా ముంబై షెడ్యూల్‌ పూర్తయింది. మరో పవర్‌ఫుల్‌ షెడ్యూల్‌ను కూడా ప్రారంభించినట్లు మేకర్స్‌ ట్వీట్‌ చేశారు. ఇది పుణెలో జరగనున్నట్లు వెల్లడించారు. ఇందులో ప్రియాంక మోహన్‌‌ పాట ఉండనున్నట్లు తెలుస్తోంది. దీనికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. 
 
ఇకపోతే, హరీశ్‌ శంకర్‌ దర్శకత్వంలో పవన్‌ నటిస్తోన్న సినిమా 'ఉస్తాద్‌ భగత్‌సింగ్‌'. ఈ సినిమా కూడా కొత్త షెడ్యూల్‌కు సిద్ధమవుతున్నట్లు నిర్మాణ సంస్థ ట్వీట్‌ చేసింది. యాక్షన్‌ ప్యాక్డ్‌ రాబోతుంది. ఇదేవిషయాన్ని హరీశ్‌ శంకర్‌ కూడా తెలిపారు. ఇది ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. 
 
ఇక ఈ అప్‌డేట్స్‌తో సోషల్‌మీడియా అంతా పవన్‌ సినిమాల ముచ్చట్లతో నిండిపోయింది. అలాగే మరోవైపు 'ఓజీ'లో అకీరా నందన్‌ కనిపించనున్నాడనే వార్త కూడా నెట్టింట తెగ సందడి చేస్తోంది. ఈ సినిమాలో పవన్‌ మూడు పాత్రల్లో అలరించనున్నాడని.. అందులో టీనేజ్‌ రోల్‌లో పవన్‌కు బదులు అకీరాను చూపించాలని సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నాడని టాక్‌ వినిపిస్తోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరీక్ష రాసేందుకు వెళ్తే స్పృహ కోల్పోయింది.. కదులుతున్న ఆంబులెన్స్‌లోనే అత్యాచారం

నా మేనేజర్‌తో నా భార్య మాట్లాడింది కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేసిండు: కౌశిక్ రెడ్డి (video)

మరొకరితో ప్రియురాలు సన్నిహితం, నువ్వు అందంగా వుండటం వల్లేగా అంటూ చంపేసాడు

తిరుమల ఘాట్ రోడ్డు.. సైకిల్‌పై వెళ్తున్న జంటపై చిరుత దాడి వీడియో వైరల్ (video)

బాలికపై అత్యాచారం.. గర్భవతి అని తెలియగానే సజీవంగా పాతిపెట్టేందుకు...

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments