Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండియన్ మైకేల్ జాక్సన్‌ను పెళ్లాడేందుకు సై : పవన్ హీరోయిన్

ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా గుర్తింపు పొందిన ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినీ కెరీర్‌లో ఎంతో ఎత్తులో ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఎత్తు పల్లాలను చవిచూశాడు.

Webdunia
గురువారం, 10 మే 2018 (14:40 IST)
ఇండియన్ మైకేల్ జాక్సన్‌గా గుర్తింపు పొందిన ప్రభుదేవా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన సినీ కెరీర్‌లో ఎంతో ఎత్తులో ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితంలో మాత్రం అనేక ఎత్తు పల్లాలను చవిచూశాడు.
 
ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత తన తొలి భార్యకు విడాకులు ఇచ్చిన ప్రభుదేవా.. కొంతకాలం హీరోయిన్ నయనతారతో డేటింగ్ చేశాడు. ఆ తర్వాత ఈమెతో కూడా మనస్పర్థలు రావడంతో బ్యాచిలర్‌ జీవితాన్ని గడుపుతున్నాడు. అయితే, ఇపుడు ఈ మ‌ల్టీ టాలెంటెడ్ ఆర్టిస్టుని వివాహం చేసుకునేందుకు హీరో ప‌వ‌న్ కళ్యాణ్ హీరోయిన్ ముందుకు వచ్చింది. 
 
ఆ హీరోయిన్ ఎవరో కాదు. నికీష్ పటేల్. "కొమరం పులి" చిత్రం ద్వారా తెలుగు వెండితెరకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో స‌రైన ఆఫ‌ర్స్ రాక కోలీవుడ్‌కి వెళ్లింది. అక్క‌డ ప‌లు చిత్రాల‌లో న‌టించిన ఈ అమ్మ‌డు క‌న్న‌డ‌లోనూ న‌టించింది. బాలీవుడ్‌లోనూ న‌టించేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. అయితే స‌రైన హిట్స్ దొర‌క్క‌పోవ‌డంతో హీరోయిన్ పాత్ర‌కి ప్రాముఖ్య‌త ఉన్న ఏ చిత్రమైన చేస్తానంటుంది. 
 
ఈనేపథ్యంలో తాజాగా ఈ అమ్మ‌డు కోలీవుడ్‌లో 'పాండిముని' చిత్రంలో న‌టిస్తుంది. రెండేళ్ళ త‌ర్వాత త‌మిళంలో న‌టిస్తున్న నికీషాని మీడియా మీకు ఏ హీరో న‌ట‌న అంటే ఇష్టం అని ప్ర‌శ్నించింది. ఇందుకు నికీషా చాలా మంది హీరోల న‌ట‌న ఇష్టం. ముఖ్యంగా ప్రభుదేవా అంటే చాలా ఇష్టమని చెప్పింది. అలాగే ఆయన ఓకే అంటే ప్ర‌భుదేవాని పెళ్లిచేసుకోవ‌డానికి కూడా సిద్ధంగా ఉన్నట్టు నికీషా చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వాటర్ వరల్డ్‌లోపడిన ఆరేళ్ల బాలుడు... ఆస్పత్రికి తరలించేలోపు...

పోసాని కృష్ణ మురళిపై సూళ్లూరు పేట పోలీస్ స్టేషన్‌లో కొత్త కేసు

అలేఖ్య చిట్టి పచ్చళ్ల వ్యాపారం క్లోజ్ ... దెబ్బకు దిగివచ్చి సారీ చెప్పింది... (Video)

గుడికి వెళ్లిన అమ్మ.. అమ్మమ్మ... ఆరేళ్ల బాలికపై మేనమామ అఘాయిత్యం!!

కొత్త రికార్డు సాధించిన శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కీరదోసను వేసవిలో ఎందుకు తినాలో తెలుసా?

మొబైల్ చూస్తూ మలవిసర్జన చేస్తున్నారా? అయితే అంతే..!!

ఈ చిన్న చిట్కాలు పాటిస్తే వేసవికాలంలో అధిక చెమటను నివారించవచ్చు!

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

తర్వాతి కథనం
Show comments