Webdunia - Bharat's app for daily news and videos

Install App

#PSPK25 రిలీజ్ డేట్ ఫిక్స్... టైటిల్ 'ఇంజనీర్ బాబు'? #BaitikochiChuste Song Audio

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం (టైటిల్ ఖరారు చేయలేదు) విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. పవన్ పుట్టిన రోజు (సెప్టెంబరు 2వ తేదీ)ని

Webdunia
శనివారం, 2 సెప్టెంబరు 2017 (15:23 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం (టైటిల్ ఖరారు చేయలేదు) విడుదల తేదీని చిత్ర యూనిట్ ప్రకటించింది. పవన్ పుట్టిన రోజు (సెప్టెంబరు 2వ తేదీ)ని పురస్కరించుకుని విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. అంతేకాకుండా, ఈ చిత్రంలోని ఓ పాటను సంగీత దర్శకుడు అనిరుధ్ కంపోజ్ చేస్తున్న వీడియోను కూడా సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు. ఈ వీడియో రిలీజ్ చేసిన కొన్ని గంటల్లోనే 14 లక్షల మంది నెటిజన్లు వీక్షించడం గమనార్హం.
 
నిజానికి, త్రివిక్రమ్ .. పవన్ కల్యాణ్ కాంబినేషన్లో రూపొందుతోన్న సినిమాపై ఎన్నో అంచనాలు నెలకొనివున్నాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు ఘన విజయాలను అందుకోవడమే అందుకు కారణం. ప్రస్తుతం రూపొందుతోన్న సినిమాకి ఇంకా టైటిల్‌ను ఖరారు చేయలేదు. పవన్ ఇందులో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా కనిపిస్తాడు కనుక 'ఇంజనీర్ బాబు'ను ఖరారు చేసే ఛాన్స్ ఉందని ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. 
 
కాగా, శుక్రవారం ఈ సినిమా నుంచి కాన్సెప్ట్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన టీమ్, రిలీజ్ డేట్‌ను శనివారం ప్రకటించడం గమనార్హం. సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చే యేడాది జనవరి 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు పేర్కొంది. సంక్రాంతి బరిలోకి పవన్ దిగనుండటం ఖాయమని తేల్చేశారు. అయితే ఈ వరుసలో 'రంగస్థలం 1985', 'భరత్ అను నేను' .. బాలకృష్ణ 102వ మూవీ ఉన్నాయి. సో... ఈ సారి సంక్రాంతికి పోటీ ఒక రేంజ్‌లో ఉండనుందన్న మాట. కాగా, ఈ చిత్రంలో హీరోయిన్లుగా అనూ ఇమ్మాన్యుయేల్, కీర్తి సురేష్‌లతో పాటు.. ఖుష్బూ సుందర్, ఆది పినిశెట్టిలు కీలక పాత్రలను పోషిస్తున్నారు. 
 
 
 
అన్నీ చూడండి

తాజా వార్తలు

నీ భర్త వేధిస్తున్నాడా? నా కోరిక తీర్చు సరిచేస్తా: మహిళకు ఎస్.ఐ లైంగిక వేధింపులు

గూగుల్ మ్యాప్ ముగ్గురు ప్రాణాలు తీసింది... ఎలా? (video)

ప్రేయసిని కత్తితో పొడిచి నిప్పంటించాడు.. అలా పోలీసులకు చిక్కాడు..

నీమచ్‌లో 84,000 చదరపు అడుగుల మహాకాయ రంగోలి ఆసియా వరల్డ్ రికార్డు

పోసాని కృష్ణమురళి రెడ్డి అని పేరు పెట్టుకోండి: పోసానిపై నటుడు శివాజి ఆగ్రహం (video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఫుట్ మసాజ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

బాదంపప్పులను తింటుంటే వ్యాయామం తర్వాత త్వరగా కోలుకోవడం సాధ్యపడుతుందంటున్న పరిశోధనలు

సింక్రోనస్ ప్రైమరీ డ్యూయల్ క్యాన్సర్‌లకు అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విజయవంతమైన చికిత్స

ఎండుద్రాక్షలు ఎందుకు తినాలో తెలుసా?

ఖాళీ కడుపుతో ఈ 5 పదార్థాలను తినకూడదు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments