హ‌రిహ‌ర వీర‌మ‌ల్లులో యాక్ష‌న్ సీక్వెన్స్‌ను ప్రాక్టీస్ చేస్తున్న ప‌వ‌న్ క‌ళ్యాణ్

Webdunia
గురువారం, 7 ఏప్రియల్ 2022 (10:57 IST)
Pawan fights practice
ప‌వ‌న్ క‌ళ్యాణ్ యాక్ష‌న్ సీన్స్ చేయ‌డంలో ప్ర‌త్యేక‌త వుంది. తెలుగులో ఏ హీరో చేయ‌ని విధంగా క‌రాటే త‌ర‌హాలో జూడో ఫైట్‌ను ఆయ‌న చేస్తుంటాడు. ఎ.ఎం.ర‌త్నం నిర్మించింని ఖుషి సినిమాలో ఆయ‌న చేసిన ఫైట్ ప్ర‌త్యేక ఆకర్ష‌ణ‌గా నిలిచింది. మ‌ళ్ళీ ఇన్నాళ్ళ‌కు వీరి కాంబ‌నేష‌న్‌లో హ‌రిహ‌ర వీర‌మ‌ల్లు చిత్రం వ‌స్తోంది. ఇటీవ‌లే ఈ సినిమాకు సంబంధించిన కొంత పార్ట్ కూడా షూట్ చేశారు.
 
Pawan fights practice
ద‌ర్శ‌కుడు క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. గ‌త కొద్దిరోజులుగా ఈ సినిమాలో యాక్ష‌న్ సీక్వెన్ కోసం ప‌వ‌న్ ప్రాక్టీస్ చేస్తున్నాడు. తైక్వాడ్ త‌ర‌హాలో క‌రాటే ఫైట్‌ను ఇందులో చేయ‌నున్నారు. ఇందులో విదేశీ ఫైట‌ర్ల ప‌ర్యేవ‌క్ష‌ణ‌లో అన్న‌పూర్ణ స్టూడియోలో ఒక ఫ్లోర్‌లో సినిమా కోసం రిహార్స‌ల్స్ చేస్తున్నారు.
 
Pawan fights practice
ఈ ఫైట్ రిహార్స‌ల్స్‌లో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ద‌ర్శ‌కుడు క్రిష్‌, నిర్మాత ఎ.ఎం. ర‌త్నం ద‌గ్గ‌రుండి చూసుకుంటున్నారు. టోడోర్ లజారోవ్ ఆధ్వ‌ర్ర‌యంలో యాక్ష‌న్ ఎపిసోడ్ చేయ‌నున్నారు. ప‌వ‌న్‌తోపాటు ఐదుగురు ఫైట‌ర్లు కూడా ఇందులో పాల్గొన్నారు. సినిమాలో ఈ ఫైట్ ప్ర‌త్యేక చాటుకోనున్న‌ద‌ని యూనిట్ చెబుతోంది.
 
Pawan fights practice
కాగా ఈ సినిమా యాక్ష‌న్ సీన్‌ను ఈనెల 8న అంటే శుక్ర‌వారం చిత్రీక‌రించ‌నున్నారు. ఇంత‌కుముందు రామోజీ ఫిలింసిటీలో కొంత భాగం చిత్రాన్ని షూట్ చేశారు. ప్ర‌స్తుత‌తం ప‌లు లొకేష‌న్ల‌లో చేయ‌నున్నారు. ఇందుకు కేర‌ళ కూడా వెళ్ళ‌నున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

స్కూలుకు లేటు.. వీపు మీద బ్యాగ్‌తోనే 100 గుంజీలు.. బాలిక మృతి.. ఎక్కడ?

యేడాదిగా టీచర్లు హేళన చేస్తున్నార... సారీ మమ్మీ... నా అవయవాలను దానం చేయండి...

Rythanna Meekosam: నవంబర్ 24 నుండి 29 వరకు రైతన్న మీకోసం..

గొంతునొప్పి అని భూతవైద్యుడి వద్దకు వెళ్తే.. గదిలోకి తీసుకెళ్లి అరగంట పాటు రేప్

ప్రియుడితో రీల్స్ : ప్రశ్నించిన భర్తను హత్య చేసిన భార్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

తర్వాతి కథనం
Show comments