Webdunia - Bharat's app for daily news and videos

Install App

'కాటమరాయుడు' కొత్త లుక్ రిలీజ్... సంక్రాంతికి టీజర్ విడుదల

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్‌ల కాంబినేషన్‌లో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత శరత్ మరార్, దర్శకుడు కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. సామాజిక

Webdunia
శనివారం, 31 డిశెంబరు 2016 (15:21 IST)
పవర్ స్టార్ పవన్ కల్యాణ్, శృతి హాసన్‌ల కాంబినేషన్‌లో నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత శరత్ మరార్, దర్శకుడు కిషోర్ పార్థసాని (డాలీ) దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రం 'కాటమరాయుడు'. సామాజిక మాధ్యమాలలో ఇప్పటికే 'కాటమరాయుడు ప్రచారం వినూత్నరీతిలో సాగుతోంది. ఈ నెల 28వ తేదీ నుంచి అంచెలంచెలుగా ''కాటమరాయుడు 'ప్రచార చిత్రాల విడుదల అభిమానుల్లో ఉత్సుకతను మరింత పెంచింది అనటానికి సామాజిక మాధ్యమాలలో లభించిన ఆదరణే సాక్ష్యం. 
 
ఈ చిత్ర ప్రచారంలో వినూత్నతకు కారణమైన ''కాటమరాయుడు'' బృందం అభినందనీయులు. అభిమానులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ''కాటమరాయుడు'' బృందం. సంక్రాంతి కానుకగా 'కాటమరాయుడు టీజర్ విడుదల అవుతుందని తెలిపారు చిత్ర దర్శక, నిర్మాతలు. చిత్రం షూటింగ్ దాదాపు పూర్తి కావచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో చిత్రం షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా 2017 మార్చిలో 'ఉగాది'కి విడుదల అవుతుంది అన్నారు. 
 
ఈ చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రలలో ఆలీ, నాజర్, రావు రమేష్, అజయ్, నర్రా శ్రీను, పృథ్వి, శివబాలాజీ, కమల్ కామరాజు, చైతన్య కృష్ణ, తరుణ్ అరోరా, ప్రదీప్ రావత్, పవిత్ర లోకేష్, రజిత, యామిని భాస్కర్, అస్మిత, రమాదేవి, భానుశ్రీ నటిస్తున్నారు. నార్త్‌స్టార్ ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై  నిర్మిత మవుతున్న ఈ కాటమరాయుడు చిత్రానికి సంగీతం అనూప్ రూబెన్స్, ప్రసాద్ మూరెళ్ళ కెమెరామన్‌గా వర్క్ చేస్తున్నారు. నిర్మాత: శరత్ మరార్, దర్శకత్వం: కిషోర్ పార్థసాని. 

భారత్ చర్యల కారణంగానే పాకిస్థాన్ భిక్షాటన దుస్థితి : యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్

తిరుమలలో ఒక్కసారిగా పెరిగిన భారీ రద్దీ!!

ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అగ్నివీర్ పథకం రద్దు : రాహుల్ గాంధీ

లైంగిక దౌర్జన్య కేసులో ప్రజ్వల్ రేవణ్ణపై అరెస్ట్ వారెంట్ జారీ!!

సిగ్నల్ లైట్‌కు బురద పూసి రైలు దోపిడీకి యత్నం!!

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

రాత్రి పడుకునే ముందు ఖర్జూరం పాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments