Webdunia - Bharat's app for daily news and videos

Install App

సెట్స్‌లోకి "ఒరిజినల్ గ్యాంగ్‌స్టార్" వచ్చేశాడు...

Webdunia
మంగళవారం, 18 ఏప్రియల్ 2023 (16:41 IST)
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుసబెట్టి చిత్రాలు చేస్తున్నారు. ఇప్పటికే నటుడు, దర్శకుడు సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన "వినోదయ సిత్తం" చిత్రంలో నటించారు. ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసిన ఆయన.. ఇపుడు మరో మూవీని పట్టాలెక్కించారు. మంగళవారం ఓజీ మూవీ సెట్స్‌లోకి అడుగుపెట్టారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేసింది. "సెట్స్‌లోకి ఓజీ అడుగుపెట్టాడు" అని క్యాప్షన్ ఇచ్చి, పవన్ కళ్యాణ్ ఫోటోను షేర్ చేసింది. "మేక్ వే ఫర్ ది ఓజీ" అంటూ ఓ కాన్సెప్ట్‌ పోస్టర్‌ను కూడా ట్వీట్ చేసింది. 
 
కాగా, 'ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్' చిత్రానికి పవన్ వీరాభిమాని, యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన గతంలో ప్రభాస్ హీరోగా "సాహో" చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ఇపుడు పవన్‌తో భారీ యాక్షన్ ఎంటర్‍‌టైనర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. మూడు రోజుల కిందట ముంబైలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్మెంట్స్ తెలియజేస్తూ ఓ ప్రత్యేక వీడియోను షేర్ చేసింది. కాగా, ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెద్ద కుమారుడుపై ఆరేళ్ళ బహిష్కరణ వేటు : లాలూ ప్రసాద్ యాదవ్ సంచలనం

కేరళ సముద్రతీరంలో మునిగిపోయిన లైబీరియా నౌక.. రెడ్ అలెర్ట్

కుప్పంలో సీఎం చంద్రబాబు దంపతుల గృహ ప్రవేశం

దేశంలో తొలి కోవిడ్ మరణం : కర్నాటకలో పెరుగుతున్న కేసులు

భారీ వర్షాలకు ఢిల్లీ అస్తవ్యస్తం - ఠాణా పైకప్పు కూలి ఎస్ఐ మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆహారంలో చక్కెరను తగ్గిస్తే ఆరోగ్య ఫలితాలు ఇవే

పిసిఓఎస్‌తో ఇబ్బంది పడుతున్నారా? వ్యాధి పరిష్కారానికి అనువైన అల్పాహారాలివిగో...

ఎసిడిటీని అడ్డుకునేందుకు 5 మార్గాలు

వేరుశనగ చిక్కీ ఆరోగ్య ప్రయోజనాలు

ఒకసారి లవంగం టీ తాగి చూడండి

తర్వాతి కథనం
Show comments