Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కళ్యాణ్ ఓ అగ్నిపర్వతం... చిరంజీవి నిరాశపరిచారు : రాంగోపాల్ వర్మ

జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. నిన్నామొన్నటి వరకు పవన్‌ను తన ట్వీట్లతో తూర్పారబట్టిన ఆర్జీవీ.. ఇపుడు ఉన్నట్టుండి ఆకాశ

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2016 (08:58 IST)
జనసేన పార్టీ అధినేత, హీరో పవన్ కళ్యాణ్‌పై వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు ఉన్నట్టుండి ప్రేమ పుట్టుకొచ్చింది. నిన్నామొన్నటి వరకు పవన్‌ను తన ట్వీట్లతో తూర్పారబట్టిన ఆర్జీవీ.. ఇపుడు ఉన్నట్టుండి ఆకాశానికెత్తేశాడు. పవన్‌ను ఓ అగ్నిపర్వతంతో పోల్చారు. ఆయన సమయం వచ్చినప్పుడు పేలుతాడని వ్యాఖ్యానించారు. పైగా వచ్చే ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తాడంటూ జోష్యం చెప్పాడు. ఇంతకీ ఆర్జీవీ చేసిన వ్యాఖ్యల్లో ఏముందో పరిశీలిద్ధాం.
 
తాను దర్శకత్వం వహించిన ‘వంగవీటి’ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా వర్మ విలేకరులతో మాట్లాడారు. 'నా దృష్టిలో పవన్ కళ్యాణ్‌ అగ్నిపర్వతంలాంటి వ్యక్తి. అప్పుడప్పుడూ గుడగుడలాడుతూ లావాతో పొగ వదులుతుంటాడు. సమయం వచ్చినప్పుడే భారీ విస్ఫోటంలా పేలతాడు' అని అన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో జరుగుతున్న పరిణామాలన్నింటినీ పవన్ నిశితంగా గమనిస్తున్నాడని, పరిస్థితుల్ని అర్థం చేసుకుంటున్నాడని, వచ్చే ఎన్నికల్లో సంచలనం సృష్టిస్తాడని, ఆ దమ్ము అతనికుందని వర్మ అన్నారు.
 
ఇకపోతే... మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా గురించి తరచూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నారెందుకన్న ప్రశ్నకు ‘ఆయనకు నేను పెద్ద అభిమానిని. తొమ్మిదేళ్ల విరామం తర్వాత వస్తున్న 150వ చిత్రం ‘బాహుబలి’ని మించి ఉండాలని ఊహించా. కానీ ఆయన ఓ రీమేక్‌ చిత్రంతో అభిమానుల ముందుకొస్తారనుకోలేదు’ అన్నారు. చిరంజీవికున్న ఫాలోయింగ్‌కి, ఆయనకున్న ఇమేజ్‌కు సరిపడే సినిమా తీసే సాహసం తాను చేయలేనని వర్మ ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

karnataka heart attacks, 32 ఏళ్ల యోగా టీచర్ గుండెపోటుతో మృతి

మాజీ మంత్రి రోజా జైలుకెళ్లడం ఖాయం : శాఫ్ చైర్మన్ రవి నాయుడు

కళ్లు కనిపించట్లేదా.. చెత్తను ఎత్తుతున్న మహిళపై కారును పోనిచ్చాడు.. టైర్ల కింద? (video)

బంగ్లాదేశ్‌లో కుప్పకూలిపోయిన యుద్ధ విమానం - 19 మంది నిర్మాతలు

Vijayashanthi: గుడ్ మార్నింగ్‌లు వద్దు.. జై తెలంగాణ అని పలకరించుకోవాలి.. విజయశాంతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

తర్వాతి కథనం
Show comments