Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ కల్యాణ్ జోకర్, కార్టూన్ హీరో.. దక్షిణాది ప్రజల ఛాయిస్ అస్సలు బాగోలేదు!

పవన్ కల్యాణ్ జోకర్, కార్టూన్ హీరో : కమాల్ రషీద్ ఖాన్

Webdunia
గురువారం, 17 మార్చి 2016 (14:09 IST)
బాలీవుడ్ నటుడు, నిర్మాత, విమర్శకుడు కమాల్ రషీద్ ఖాన్..  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై నోరు పారేసుకున్నాడు. పవన్ కల్యాణ్ లాంటి జోకర్, కార్టూన్ హీరో సినిమాలు చూసేదానికంటే.. రాజ్ పాల్ యాదవ్ సినిమాలు చూసేందుకే ఇష్టపడతానని రషీద్ ఖాన్ తెలిపాడు. ట్విట్టర్ వేదికగా పవన్‌పై రషీద్ ఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. 
 
పవన్ కల్యాణ్ వంటి వాడే హీరో అయితే ప్రపంచంలో ఎవరైనా సూపర్ స్టార్ కావొచ్చునని.. ఇంతకీ దక్షిణాది ప్రేక్షకులకు ఏమైంది.. ఇలాంటి కార్టూన్‌ని వాళ్లు ఎలా హీరోగా అంగీకరిస్తున్నారని అడిగారు. దక్షిణాది ప్రజల ఛాయిస్ అస్సలు బాగోలేదన్నాడు. అయితే పవన్ మీద వ్యాఖ్యలు చేసిన రషీద్ ఖాన్‌కి పవన్ పూర్తిపేరు కూడా సరిగా తెలియనట్లుంది. 'పవన్ కళ్యాణ్ సింగ్' అని పవన్ పేరును ప్రస్తావించాడు.
 
ఇప్పటికే స్టార్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ తనకు పవన్ అంటే ఇష్టమని.. అయితే పవన్ ఫ్యాన్స్ అంటే ఇష్టపడనని చెప్పాడు. తాజాగా అదే లిస్ట్లో కమాల్ రషీద్ ఖాన్ కూడా చేరిపోయాడు. కమాల్ ట్వీట్లపై పవర్ స్టార్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. 
 
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సర్దార్ గబ్బర్సింగ్ సినిమా తెలుగుతో పాటు హిందీలోనూ ఒకేసారి విడుదలకు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో రషీద్ ఖాన్ తన వ్యక్తిగత ప్రచారం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని ఫ్యాన్స్ కోపంతో ఊగిపోతున్నారు. ఇప్పటికే కమాల్ సోనాక్షి సిన్హా, అలియా భట్, సిద్ధార్థ్ మల్హోత్రా, బాహుబలిపై కూడా సెన్సేషనల్ కామెంట్స్ చేశాడు.

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

పైల్స్‌ సమస్య, ఈ ఆహారాన్ని తినకుండా వుంటే రిలీఫ్

మేడ మెట్లు ఎలాంటి వారు ఎక్కకూడదో తెలుసా?

ఖాళీ కడుపుతో మునగ ఆకుపొడి నీరు తాగితే ప్రయోజనాలు ఏమిటి?

అంతర్జాతీయ నర్సుల దినోత్సవం: నర్సులను సత్కరించిన కేర్ హాస్పిటల్స్ గ్రూప్

నల్లద్రాక్షను తినేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

Show comments