Webdunia - Bharat's app for daily news and videos

Install App

సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత తెచ్చిన నటుడు : పవన్ కళ్యాణ్

Webdunia
మంగళవారం, 15 నవంబరు 2022 (11:30 IST)
సూపర్ స్టార్ కృష్ణ మృతిపట్ల హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సూపర్ స్టార్ బిరుదుకి సార్థకత తెచ్చిన నటుడు అని అన్నారు. ముఖ్యంగా, ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉండేవారన్న ఆయన తెలిపారు. ఎంపీగా కూడా ప్రజా జీవితంలో తనదైన ముద్ర వేశారని ఆయన ప్రశంసించారు. కృష్ణ మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ తన స్పందనను తెలిపారు. 
 
కృష్ణగారు అస్వస్థతతో అసుపత్రిలో చేరారని తెలిశాక కోలుకుంటారని ఆశించానని, కానీ ఇపుడు ఈ విషాద వార్త వినాల్సి వచ్చిందని చెప్పారు. కృష్ణగారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపాు. స్నహశీలి, మృదుస్వభావి అయిన కృష్ణగారు ప్రతి ఒక్కరితోనూ ఎంతో ఆప్యాయంగా ఉండేవారని చెప్పారు. మద్రాస్‌లో ఉన్నప్పటి నుంచి తమ కుటుంబంతో ఆయనకు చక్కటి అనుబంధం ఉందని గుర్తుచేశారు. 
 
తెలుగు చిత్రపరిశ్రమ అభివృద్ధికి ఆయన ఎంతగానో కృషి చేశారన్నారు. హీరోగా నటిస్తూనే, నిర్మాతగా, దర్శకుడిగా, స్టూడియో అధినేతగా ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని తెలిపారు. తెలుగు సినీ ప్రస్థానంలో ఆయన నూత సాంకేతిక పరిజ్ఞానాన్ని పరిచయం చేశారని కొనియాడారు. విభిన్న పాత్రలను పోషించిన కృష్ణ కౌబోయ్, జేమ్స్ బాండ్ కథలతో తెలుగు ప్రేక్షకులకు కొత్త అనుభూతిని కలిగించారని చెప్పారు.
 
పార్లమెంట్ సభ్యుడిగా కూడా ప్రజా జీవితంతో తనదైనముద్ర వేశారని ప్రశంసించారు. ఆయన మృతి తెలుగు చిత్రపరిశ్రమకు మాత్రమే కాకుండా హీరో మహేష్ బాబు కుటుంబానికి తీరని లోటన్నారు. మహేష్‌కు, ఇతర కుటుంబ సభ్యులకు తన తరపున, జనసేన పక్షాన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఎస్వీయూ క్యాంపస్‌లో సంచరిస్తున్న చిరుత!!

మార్కెటింగ్ కంపెనీ అమానవీయ చర్య.. ఉద్యోగులను కుక్కల్లా నడిపించింది (Video)

అమరావతి రైల్వే నిర్మాణానికి లైన్ క్లియర్.. త్వరలో టెండర్లు!

గురుకుల పాఠశాల మరుగుదొడ్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు (Video)

ఎనిమిదో అంతస్తు నుంచి దూకి ఐటీ శాఖ ఇన్‌స్పెక్టర్ ఆత్మహత్య!!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మొలకెత్తిన బంగాళదుంపలు తింటే?

చిలగడదుంపలతో ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయా?

సూపర్ ఫుడ్ తింటే ఉత్సాహం ఉరకలు వేస్తుంది

కిడ్నీలు వైఫల్యానికి కారణాలు ఏమిటి?

ఈ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ వేళ, కాలిఫోర్నియా బాదంపప్పులతో మీ ఆరోగ్యం

తర్వాతి కథనం
Show comments