Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాబోయే భర్తతో ఎంజాయ్ చేస్తున్న రేణూ దేశాయ్...

హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తనకు కాబోయే భర్తతో ఎంజాయ్ చేస్తోంది. అయితే, తనకు కాబోయే భర్త ముఖాన్ని మాత్రం ఆమె ఇప్పటికీ అత్యంత రహస్యంగా ఉంచింది. ఈ అంశం ఇపుడు అత్యంత హాట్ టాపిక్‌గా మారింది.

Webdunia
ఆదివారం, 15 జులై 2018 (12:49 IST)
హీరో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ తనకు కాబోయే భర్తతో ఎంజాయ్ చేస్తోంది. అయితే, తనకు కాబోయే భర్త ముఖాన్ని మాత్రం ఆమె ఇప్పటికీ అత్యంత రహస్యంగా ఉంచింది. ఈ అంశం ఇపుడు అత్యంత హాట్ టాపిక్‌గా మారింది.
 
పవన్‌ను పెళ్లి చేసుకున్న రేణూ దేశాయ్ ఇద్దరు పిల్లలకు తల్లి. ఆ తర్వాత వారిద్దరూ విడిపోయారు. అలా విడిపోయిన తర్వాత ఎనిమిదేళ్ళకు రేణూ దేశాయ్ పెళ్లి చేసుకునేందుకు సిద్ధమైంది. ఇందులోభాగంగా, ఇటీవల తనకు నచ్చిన వ్యక్తితో నిశ్చితార్థం చేసుకుంది. 
 
తనది పెద్దలు కుదిర్చిన సంబంధమే అని చెప్పిన రేణూ, అతను సినిమాకి చెందిన వ్యక్తి కాదని మాత్రం క్లారిటీ ఇచ్చింది. అయితే రేణూ పెళ్లి చేసుకుంటానని ఎప్పుడు ప్రకటించిందో అప్పటి నుంచి ఆమెపై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. కొందరు అభిమానులు రేణూకి కాబోయే భర్తని పరిచయం చేయమని సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. 
 
అయితే నిశ్చితార్థం చేసుకుని రేణూ త్వరలో వివాహం చేసుకోనుంది. పెళ్లి తర్వాతే తనకి కాబోయే భర్త మొహాన్ని రివీల్ చేస్తానని ఓ ఇంటర్వ్యూలో రేణూ చెప్పింది కూడా. అయితే ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న రేణూ తనకి కాబోయే భర్తతో కలిసి ఓ ఫోటో దిగింది. ఆ ఫోటోలో అతని మొహాన్ని దాచిపెట్టి, కేవలం తను మాత్రం కనిపిస్తున్న ఫోటోని షేర్ చేసింది.
 
దీంతో రేణూ అభిమానులు మరోసారి నిరూత్సాహానికి గురయ్యారు. అయితే తనకి కాబోయే భర్త గురించి పోస్ట్ పెట్టిన ప్రతిసారి పవన్ అభిమానుల ఆగ్రహానికి గురవుతుండగా, తాజా పోస్ట్‌పై వారు ఎలా స్పందిస్తారో చూడాలి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాలీవుడ్ నటుడు అజాజ్ ఖాన్ భార్య అరెస్టు!!

ఏపీలో ఒక రోజు ముందుగానే సామాజిక పింఛన్ల పంపిణీ.. నేమకల్లుకు సీఎం బాబు

ఆంధ్ర నుంచి ఆఫ్రికాకు రేషన్ బియ్యం, కాకినాడ పోర్టు స్మగ్లింగ్ కేంద్రంగా మారిందా?

రేవంత్ రెడ్డి "ఏఐ సిటీ"కి శంకుస్థాపన ఎప్పుడో తెలుసా?

హైదరాబాద్‌- 50వేల కేసులు, రూ.10.69 కోట్ల ఫైన్.. 215మంది మృతి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

లవంగం పాలు ఆరోగ్య ప్రయోజనాలు

చియా విత్తనాలు అద్భుత ప్రయోజనాలు

Winter Fruit కమలా పండ్లును తింటే ప్రయోజనాలు

ఎర్ర జామ పండు 7 ప్రయోజనాలు

ఉసిరికాయలను తేనెలో ఊరబెట్టి తింటే?

తర్వాతి కథనం
Show comments