Webdunia - Bharat's app for daily news and videos

Install App

పవన్ సాటిలేని హీరో, ఆయనకు పొలిటిక్స్ అవసరం లేదు కానీ ప్రజల కోసం: ఘట్టమనేని మంజుల

ఐవీఆర్
శనివారం, 27 ఏప్రియల్ 2024 (12:23 IST)
రాజకీయ ప్రసంగాలు ఒక్కోసారి మిస్ ఫైర్ అవుతుంటాయి. ఉద్దండులైన నాయకులకు సైతం ఇది జరుగుతుంటుంది. పవన్ కల్యాణ్ తాజాగా సూపర్ స్టార్ కృష్ణ గురించి చేసిన వ్యాఖ్యలు ఇలాగే మిస్ ఫైర్ అయ్యాయి. దీనితో పవన్ కాస్త ఇబ్బందుల్లో పడ్డాడు. ఈ నేపధ్యంలో కృష్ణ కుమార్తె ఘట్టమనేని మంజుల చేసిన వ్యాఖ్యల తాలూకు వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
 
ఆమె ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ కల్యాణ్ తో సినిమా చేయాలని వుందని చెప్పారు. ఆ విషయాన్ని పలుమార్లు ఆమె చెప్పినప్పటికీ పవన్ ఆమెతో సినిమా చేయలేదు. తన వద్ద పవన్‌కి సరిపడా కథ వుందని ఆమె అనుకున్నప్పటికీ పరిస్థితులు అందుకు అనుకూలించలేదనే అనుకోవచ్చు. మొత్తమ్మీద పవన్ కల్యాణ్ తో ఆమె చిత్రం చేయలేదు. ఇదిలావుంటే తాజాగా పవన్ రాజకీయ ప్రస్థానం గురించి ఆమె స్పందించారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో పవన్, మహేష్ బాబు సాటిలేని హీరోలని చెప్పారు.
 
ఇలాంటి పీక్ స్థాయిలో వున్నప్పుడు ఎవ్వరూ కూడా కెరీర్ వదిలేసి రాజకీయాల్లోకి వెళ్లాలని అనుకోరు. ఎన్టీఆర్, ఎంజీఆర్ వంటి నటులు కూడా 60 ఏళ్లకి దగ్గర్లో వున్నప్పుడు వారు రాజకీయాల్లోకి వెళ్లారు. కానీ పవన్ కల్యాణ్ తన కెరీర్ అత్యున్నత స్థాయిలో వున్నప్పుడు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఆయనకు ఈ దశలో రాజకీయాలు అవసరంలేదు. తన మనసులో సమాజం కోసం, ప్రజల కోసం ఏదో చేయాలన్న తపన వున్నది. తన మనసు చెప్పిన మాటకే ప్రాధాన్యం ఇచ్చి రాజకీయాల్లోకి వెళ్లారు. ఇలాంటివారు చాలా అరుదుగా వుంటారు అంటూ పవన్ కల్యాణ్ ను ప్రశంసలతో ముంచెత్తారు.

సంబంధిత వార్తలు

పవన్ మ్యాన్ ఆఫ్ ది మూమెంట్.. కొత్త శక్తి.. లగడపాటి శ్రీధర్

జగన్ వెనుకే జనం వున్నారు, భారీ విజయం సాధిస్తాం: సజ్జల జోస్యం

శ్రీశైలంలో తలపై కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న కానిస్టేబుల్, కారణం ఏంటి?

గృహనిర్భంధంలో వైకాపా ఎమ్మెల్యేలు.. పల్నాడులో అప్రమత్తం

భగవంతుడుని ప్రార్థించి ఆ 2 కోర్కెలు కోరాను, అందుకే నన్ను పిఠాపురం పిలిచారు: పవన్ కల్యాణ్

వేరుశనగ పల్లీలు ఎందుకు తినాలి?

టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

మెదడు ఆరోగ్యంపై ప్రభావం చూపే శారీరక శ్రమ

పరగడపున వేప నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే

ఇలాంటి అలవాట్లు తెలియకుండానే కిడ్నీలను డ్యామేజ్ చేస్తాయి

తర్వాతి కథనం
Show comments