పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోలేదంటున్న భర్త, మరేంటి?

ఐవీఆర్
మంగళవారం, 14 మే 2024 (10:33 IST)
త్రినయని. ఈ సీరియల్ చూసేవారికి పవిత్రా జయరామ్ పరిచయం అక్కర్లేదు. కన్నడ, తెలుగు సీరియళ్లలో పాపులర్ నటిగా పేరుగాంచిన పవిత్రా జయరామ్ రోడ్డు ప్రమాదంలో చనిపోయిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆమె రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని ఆమె భర్త చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకుని ఆమె అభిమానులు షాక్ తింటున్నారు.
 
అసలు ఆరోజు ఏం జరిగిందంటే... ఆమె ప్రయాణిస్తున్న కారు.. 44వ జాతీయ రహదారిపై భూత్‌పూర్ సమీపంలోని శేరిపల్లి వద్ద వెళుతుండగా, అదుపుతప్పి రోడ్డు డివైడర్‌ను గుద్ది.. ఆ తర్వాత ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో ఈ కారులో ప్రయాణిస్తూ వచ్చిన పవిత్ర కుటుంబ సభ్యులు, మరో నటుడు చంద్రకాంత్‌లు గాయపడ్డారు. వీరిలో పవిత్ర మృతి చెందారు. మిగిలినవారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
 
ఐతే ఆ ప్రమాదంలో పవిత్రకు గాయాలేమీ కాలేదట. కానీ చంద్రకాంత్ కు తీవ్రగాయాలై రక్తం కారుతూ వుండటాన్ని చూసి షాక్ తిన్నదట. ఆ షాక్ లోనే ఆమెకి గుండెపోటు వచ్చిందట. తను చూస్తుండగానే తన కళ్లెదుటే గుండెపోటుతో మరణించిందని భర్త చంద్రకాంత్ ఆవేదనతో చెప్పారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లి ముహూర్త చీర కట్టుకునే విషయంపై వివాదం.. ఆగ్రహించి వధువు హత్య చేసిన వరుడు

రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఓ స్థిరపత్రంగా చూడలేదు : చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్

బీహార్ ముఖ్యమంత్రి కుర్చీలో మరోమారు నితీశ్ కుమార్

లాలూ కుటుంబంలో చిచ్చుపెట్టిన బీహార్ అసెంబ్లీ ఫలితాలు.. ప్యామిలీతో కటీఫ్

చాయ్‌వాలా దేశ ప్రధానమంత్రి ఎలా అయ్యారు? సీఎం చంద్రబాబు ప్రశ్న

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

250 మిల్లీ లీటర్ల మంచినీటిలో మెంతి గింజలు నానబెట్టి తాగితే షుగర్ కంట్రోల్

తర్వాతి కథనం
Show comments